Sreeja Kalyan Dhev : సంతోషంగా ఉన్నానంటున్న కల్యాణ్ దేవ్.. శ్రీజ లేకుండానేనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeja Kalyan Dhev : సంతోషంగా ఉన్నానంటున్న కల్యాణ్ దేవ్.. శ్రీజ లేకుండానేనా..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 February 2022,7:40 am

Sreeja Kalyan Dhev : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ డైవోర్స్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం శ్రీజనే. ఆమె ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నేమ్ ‘శ్రీజ కల్యాణ్’.. ఉండగా దానిని ‘శ్రీజ కొణిదెల’గా మార్చేసింది. దాంతో వీరిరువురు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై మెగా ఫ్యామిలీ మెంబర్స్ కాని శ్రీజ కాని కల్యాణ్ దేవ్ కాని ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు.శ్రీజ ఇటీవల తన అన్నయ్య రామ్ చరణ్ తేజ్ తో కలిసి ముంబైకి హాలీ డే ట్రిప్‌నకు వెళ్లింది.

అక్కడ దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది కూడా. కాగా, అక్కడ కల్యాణ్ దేవ్ ఎందుకు లేడు? అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా కల్యాణ్ దేవ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎన్నో ఆశలతో, ప్రేమతో ఆనందంగా ముందుకు సాగుతున్నానని చెప్పాడు. ఇదంత తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ గురించి రాసుకొచ్చాడు. ఈయితే, ఈ పోస్టును కల్యాణ్ దేవ్ క్రిస్మస్ రోజున పోస్ట్ చేశాడు. తాజాగా మళ్లీ రీ పోస్ట్ చేశాడు.

kalyaan dhev post viral in social media

kalyaan dhev post viral in social media

Sreeja Kalyan Dhev : మెగా కాంపౌండ్ కు దూరంగా కల్యాణ్ దేవ్…

అలా మొత్తంగా కల్యాణ్ దేవ్ తన పక్కన శ్రీజ లేకపోయినప్పటికీ తాను సంతోషంగా ఉన్నానని చెప్పకనే చెప్తున్నాడా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ ముంబైలో రామ్ చరణ్ తో ఉండగా, కల్యాణ్ దేవ్ తన నెక్స్ట్ ఫిల్మ్ షూట్ లో బిజీగా ఉన్నాడని ఈ సందర్భంగా అర్థమవుతోంది. ఇకపోతే కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన ‘సూపర్ మచ్చి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఫ్లాప్ అయింది. ‘విజేత’ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘కిన్నెరసాని’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది