The Warrior Movie Review : ది వారియర్ మూవీ ఫస్ట్ రివ్యూ … !
The Warrior Movie Review : ఎన్ లింగుస్వామి తమిళంలో స్టార్ డైరెక్టర్. ఆయన తమిళంలో తీసిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్టు. అలాగే.. ఆ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయ్యేవి. కానీ.. తొలిసారిగా లింగుస్వామి డైరెక్ట్ తెలుగు మూవీ తీశాడు. అదే ది వారియర్. ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమాలో హీరో. పోలీస్ ఆఫీసర్ పాత్రలో తొలిసారి రామ్ కనిపించనున్నాడు. రామ్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించింది. తను రేడియో జాకీ పాత్రను పోషించింది. ఇప్పటికే మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో తనేంటో నిరూపించుకున్నాడు రామ్. మళ్లీ అదే మాస్ అండ్ యాక్షన్ జానర్ లో ది వారియర్ అంటూ ఇంకాసేపట్లో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను జులై 14న అంటే రేపు విడుదల చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సంపాదించుకున్నాయి. పాటలు కూడా మాస్ ఆడియెన్స్ ను సంపాదించుకున్నాయి…
The Warriorr Movie Review : ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు రామ్ కెరీర్ లోనే ది వారియర్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలంగాణలో 250 థియేటర్లలో, ఏపీలో సుమారు 450 థియేటర్లు, తమిళనాడు, నార్త్ ఇండియా, కర్ణాటకలో 230 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓవర్ సీస్ లో మరో 350 స్క్రీన్స్ లో విడుదలవుతోంది.
![The Warrior Movie Review and live updates](https://thetelugunews.com/wp-content/uploads/2022/07/The-Warrior-Review.jpg)
The Warrior Movie Review and live updates
The Warrior Movie Review : సినిమా పేరు : ది వారియర్
నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు
దర్శకత్వం : ఎన్ లింగుస్వామి
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
ఎడిటర్ : నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీప్రసాద్
రిలీజ్ డేట్ : 14 జులై 2022
విడుదలయ్యే భాషలు : తెలుగు, తమిళం
రన్నింగ్ టైమ్ : 155 నిమిషాలు(2 గంటల 35 నిమిషాలు)
అన్నీ కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 1280 థియేటర్లలో ది వారియర్ విడుదలవుతోంది. మరోవైపు సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయించేశారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లో రూ.175 గా నిర్ణయించగా.. మల్టీప్లెక్స్ లలో రూ.295 గా నిర్ణయించారు. ఏపీలో సింగిల్ థియేటర్లలో రూ.147, మల్టీప్లెక్స్ లలో రూ.177 గా నిర్ణయించారు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కావడం, తొలిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం, ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండటం.. సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ జానర్ లో వస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకాసేపట్లో ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో ప్రారంభం కానున్నాయి.