Anil Ravipudi : రాజా ది గ్రేట్ రామ్ చేయాల్సిందా.. అనిల్ తో రామ్ గొడవకు కారణం ఏంటి..?
ప్రధానాంశాలు:
Anil Ravipudi : రాజా ది గ్రేట్ రామ్ చేయాల్సిందా.. అనిల్ తో రామ్ గొడవకు కారణం ఏంటి..?
Anil Ravipudi : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi అనిల్ రావిపూడి తన థర్డ్ సినిమా రాజా ది గ్రేట్ Raja the Great Movie చేశాడు. మాస్ మహారాజ్ Ravi teja రవితేజతో చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే రాజా ది గ్రేట్ సినిమా Raja the Great Movie కథ ముందు రామ్ కి వినిపించగా అతను కూడా సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు సోషల్ మీడియాలో బ్లైండ్ గా నటిస్తున్నా అని అనౌన్స్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుంచి రామ్ ఎగ్జిట్ అవ్వడం రవితేజ ఎంటర్ అవ్వడం జరిగింది. రామ్ Ram తో సినిమా చేయాలని ఉన్నా చివరి నిమిషంలో అది చేజారింది. ఈ విషయంపై అనిల్ రావిపూడి ఇదివరకు ఎప్పుడు స్పందించలేదు. కానీ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు. రామ్ తో అనుకున్న కథే కానీ రామ్ కోసం వేరేలా రాసుకున్నానని అన్నారు అనిల్ రావిపూడి. ఐతే అప్పటికే రామ్ వరుస మాస్ సినిమాలు చేసి ఉన్నాడు సో మళ్లీ మాస్ సినిమా అంటే వర్క్ అవుట్ అవుతుందో లేదో అని కొన్నాళ్లు వెయిట్ చేయించాడు. కానీ ఇప్పటికీ ఆ కాంబో సెట్ అవ్వలేదు.
Anil Ravipudi : సినిమా అంటే ఇక ఏ హీరో కూడా..
రామ్ వదిలేసిన రాజా ది గ్రేట్ తో సూపర్ హిట్ కొట్టాడు రవితేజ. అనిల్ డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది ఆ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. అప్పటి నుంచి అనిల్ రావిపూడి సినిమా అంటే ఇక ఏ హీరో కూడా నో అని చెప్పట్లేదు. రామ్ తో గొడవలేమి లేవు తన తో ఎప్పుడు కుదిరినా సరే సినిమా చేస్తానని అన్నాడు అనిల్ రావిపూడి.
రీసెంట్ గా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ లో 8 సినిమాలు తీసి 8 సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి రాజమౌళి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్ సూపర్ సెన్సేషన్ సృష్టించాడు. సో అనిల్ ఇక రాబోతున్న సినిమాలతో కూడా హిట్లు సూపర్ హిట్లు కొట్టేస్తాడని చెప్పొచ్చు. Anil Ravipudi, Ram Pothineni, Movie, Raja The Great, Raviteja