Neethone Nenu Movie Review : నీతోనే నేను మూవీ రివ్యూ.. విద్యా వ్యవస్థపై తీసిన మంచి చిత్రం
Neethone Nenu Movie Review : మనిషికి ఏం ఉన్నా లేకపోయినా కూడా విద్యతో వచ్చే గుర్తింపు, మర్యాద మరేక్కడా దొరకడదు. విద్య గొప్పదనాన్ని చాటుతూ, ఎడ్యుకేషన్ ప్రధానంగా సాగే సినిమాలు తక్కువగా వస్తుంటాయి. అలాంటి ఓ మంచి ప్రయత్నమే ‘నీతోనే నేను’. టీచర్‌గా పని చేసి తనకున్న అనుభవాలతో ఎమ్.సుధాకర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని అంజి రామ్ తెరకెక్కించాడు. సినిమా బండి ఫేమ్ వికాష్ వశిష్ట, కుషిత కళ్లపు, మోక్ష కథానాయకులుగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ: నీతోనే నేను మూవీ రివ్యూ
రామ్ (వికాస్ వశిష్ట) గవర్నమెంట్ స్కూల్ టీచర్. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే బయట ఎలాంటి చిన్న చూపు ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ రామ్ అలాంటి ఓ సాధారణ టీచర్ కాదు. స్కూల్‌లో పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వారికి ఎలాగైనా మంచి చేయాలని తాపత్రయపడే తత్త్వం కలవాడు. ఇక అతడ్ని చూసి తనను చూసి కొందరు ఈర్ష్య పడితే మరికొందరు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయేషా(కుషిత కళ్లపు) రామ్‌ను చూసి ఇష్టపడుతుంది. ఆమె కూడా అదే స్కూల్‌లో పీఈటీగా పని చేస్తుంది. ఒకానొక సందర్భంలో తన ప్రేమను రామ్‌కు చెబుతుంది ఆయేషా . కానీ రామ్ జీవితంలోకి ఆల్రెడీ సీత ఉంటుందని తెలుసుకుంటుంది ఆయేషా. ఆ తరువాత ఆయేషాకు ఎదురైన ఘటనలు ఏంటి? రామ్ సీతల కథ ఏంటి? సీతకు ఏమై ఉంటుంది? చివరకు స్కూల్ పరిస్థితి ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు : నీతోనే నేను మూవీ రివ్యూ
రామ్ పాత్రలో మంచి ఉపాధ్యాయుడిగా వికాస్ వశిష్ట మెప్పించాడు. సినిమా బండితో ఆకట్టుకున్న వికాస్ వశిష్ట.. నీతోనే నేను చిత్రంలో అందరినీ మెప్పిస్తాడు. ఓ వైపు గవర్నమెంట్ టీచర్‌గా, మరో వైపు భార్య కోసం పరితపించే పాత్రలో మెచ్యూర్డ్‌గా నటించాడు. కుషిత కళ్లపు తెరపై అందగా కనిపిస్తే.. ఎమోషనల్ పాత్రలో మోక్ష ఆకట్టుకుంది. కన్నింగ్ టీచర్ పాత్రలో ఆకెళ్ల నటన ఆకట్టుకుంది. ఇలా సినిమాలోని అన్ని పాత్రలు ఓ మోస్తరుగా మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ: నీతోనే నేను మూవీ రివ్యూ
ప్రభుత్వ పాఠశాల దుస్థితిని చూపించేలా ఈ చిత్రం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే పిల్లలకు చాలా సరైన వసతులు ఉండవు. అలాంటి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టు అవుతుంది. ప్రభుత్వ పాఠశాలు, విద్యకు ఉన్న గొప్పదనం గురించి దర్శకుడు అంజిరామ్ తెరకెక్కించిన తీరు బావుంది.
ఇలా ఓ వైపు సందేశాన్ని ఇస్తూనే.. మరో వైపు మెసేజ్‌తో పాటు మంచి లవ్ స్టోరీని మిక్స్ చేసి తెరకెక్కించారు. కథను స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళుతూ ఇంటర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మధ్య ఇచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఫస్టాఫ్‌ను కాస్త సాగదీతగా చేసినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది.
ద్వితీయార్దంలో వచ్చే ట్విస్టులను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. పాటలు అంతగా గుర్తుండకపోయినా ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. విజువల్స్ బావున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వంద శాతం న్యాయం చేశాయి. నిర్మాత సుధాకర్ రెడ్డి తన పరిధి మేరకు మంచి కమర్షియల్ అంశాలతో సినిమాను రూపొందించారు.
రేటింగ్ 2.75