Virat Kohli – Suryakumar Yadav : టీ20లో కొత్త రూల్ తెచ్చే ఆలోచనలో బీసీసీఐ.. జట్టు నుండి విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ ఔట్
Virat Kohli – Suryakumar Yadav : ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న టీమిండియా ప్రయాణంకి వరల్డ్ కప్ లో బ్రేకులు పడ్డాయి. ఆడిన ప్రతి మ్యాచ్‌లోను సాదాసీదాగా ఆడారు. గెలిచిన ప్రతి మ్యాచ్ కష్టంగా గెలిచిందే. దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్టుపై తేలిపోయిన భారత్ చిన్న జట్లపై ఏదో అలా నెట్టుకొచ్చింది. సెమీస్‌లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది.ఈ టోర్నీలో టీమిండియా స్టార్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించిన కూడా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటం, ఓపెనర్లు వరుస వైఫల్యాల వలన భారత జట్టుకు ట్రోఫీ అందించలేకపోయారు. గ్రూప్ దశలో జోరు చూపించి, సెమీస్‌లో ఓడిన భారత జట్టుని ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
టీ20 జట్టు నుంచి సీనియర్లను తప్పించి.. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బోర్డు ఒక ఆలోచన చేస్తుందని సమాచారం. ప్రస్తుత జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం వలన అనుకున్నంతగా పరుగులు చేయలేకపోతున్నారు. అందుకే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీ20 జట్టు నుండి పక్కకు పెట్టాలని అనుకుంటుందట. ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు సూర్యకుమార్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు టీ20లకు పరిగణనలోకి తీసుకోరనే వాదన ఉంది.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన సూర్య..!
Virat Kohli – Suryakumar Yadav ; వేటు పడనుందా?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆయనని పక్కన పెట్టడం భావ్యం కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజులలో వరుసగా వన్డేలు, టెస్టులు ఉండనుండగా, కీలక ఆటగాళ్లపై అధిక భారం పడకుండా, ఫిట్‌నెస్ దెబ్బతినకుండా చూడటం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని కొందరి మాటగా తెలుస్తుంది. చూడాలి మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందనేది. మరి కొద్ది రోజులలో టీమ్ ఇండియా ప్లేయర్లలో కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారముందని కూడా ఓ వార్త అందుతుంది. రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య జట్టు పగ్గాలు చేపడతాడని, అతనిలో కెప్టెన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట.