Team India T20 World Cup 2026 : టీమిండియా ప్లేయ‌ర్స్‌కి అనారోగ్య స‌మ‌స్య‌లా.. మ‌రో ప్లేయ‌ర్ ఔట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India T20 World Cup 2026 : టీమిండియా ప్లేయ‌ర్స్‌కి అనారోగ్య స‌మ‌స్య‌లా.. మ‌రో ప్లేయ‌ర్ ఔట్..?

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2026,9:13 pm

ప్రధానాంశాలు:

  •  Team India T20 World Cup 2026 : టీమిండియా ప్లేయ‌ర్స్‌కి అనారోగ్య స‌మ‌స్య‌లా..మ‌రో ప్లేయ‌ర్ ఔట్..?

Team India T20 World Cup 2026 : టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ Abhishek Sharma పేరు వినగానే ప్రత్యర్థి బౌలర్లలో టెన్షన్ మొదలవుతుంది. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచే అటాకింగ్ ఆటతీరుతో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించడం ఆయన ప్రత్యేకత. అందుకే మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రత్యర్థి జట్లు అభిషేక్ శర్మను ఎలా ఔట్ చేయాలన్న దానిపై ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంటాయి. అయితే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో మాత్రం ఆయన ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కాని శనివారం వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Team India T20 World Cup 2026 టీమిండియా ప్లేయ‌ర్స్‌కి అనారోగ్య స‌మ‌స్య‌లామ‌రో ప్లేయ‌ర్ ఔట్

Team India T20 World Cup 2026 : టీమిండియా ప్లేయ‌ర్స్‌కి అనారోగ్య స‌మ‌స్య‌లా..మ‌రో ప్లేయ‌ర్ ఔట్..?

Team India T20 World Cup 2026  టెన్ష‌న్ అక్క‌ర్లేదు..

ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేయగా, ఓపెనర్‌గా దిగిన అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అభిమానులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, భారత్ ఫీల్డింగ్‌కు దిగినప్పుడు అభిషేక్ శర్మ మైదానంలో కనిపించలేదు. దీంతో అతనికి గాయం అయ్యిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ అభిషేక్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో వారి అందుబాటుపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపాడు. ఇదే విషయంపై టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు.

అందుకే ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదని, కానీ వచ్చే మ్యాచ్‌లో బ్యాట్‌తో తన మాయాజాలాన్ని చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్, సిరాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అభిషేక్ శర్మకు పెద్ద సమస్య ఏమీ లేదని, స్వల్ప అనారోగ్యమే కారణమని స్పష్టమవుతోంది. తదుపరి మ్యాచ్ నాటికి పూర్తిగా కోలుకుంటే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉండగా, ఫిట్‌నెస్‌పై ఆధారపడి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం అతను త్వరగా కోలుకుని మళ్లీ తన దూకుడు ఆటతో మెరవాలని ఆశిస్తున్నారు.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది