Suryakumar Yadav : ఇంత కుల‌పిచ్చా..? వన్డేలకు సూర్యకుమార్‌ యాదవ్ ను సెల‌క్ట్ చేయ‌ని బీసీసీఐ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Suryakumar Yadav : ఇంత కుల‌పిచ్చా..? వన్డేలకు సూర్యకుమార్‌ యాదవ్ ను సెల‌క్ట్ చేయ‌ని బీసీసీఐ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 November 2022,8:20 pm

Suryakumar Yadav : ఇటీవ‌లి కాలంలో సూర్య కుమార్ యాద‌వ్ పేరు తెగ మారు మ్రోగిపోతున్న విష‌యం తెలిసిందే.అందుకు కార‌ణం సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండ‌డ‌మే. అతని బ్యాటింగ్ చూస్తే ఎవరైన ఆశ్చర్యపోవడం ఖాయం. కొన్ని కొన్ని షాట్లు సూర్యకుమార్ ఎలా కొడతాడో కూడా ఎవరికీ అర్థం కావ‌ట్లేదు. సూర్య బ్యాటింగ్ చూస్తుంటే అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో కూడా ఒక్కోసారి అర్థం కాదని ప‌లువురు మాజీలు కూడా చెప్పుకొచ్చారు. అయితే టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను వ‌న్డేల‌తో పాటు బంగ్లాదే‌శ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆడించ‌కూడ‌ద‌నే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ సైతం టెస్టు, వ‌న్డే క్రికెట్ ఆడాలనే కోరికను వెల్లబుచ్చాడు. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన తొలి రోజుల్లో అందరిలాగే తాను కూడా ముంబై తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడిన విషయాన్ని సూర్య గుర్తు చేసుకున్న సూర్య‌… టెస్టు క్రికెట్‌ను సైతం తాను ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ జట్టులో రెండు మార్పులు చేస్తూ.. రవీంద్ర జడేజా, దయాల్‌ స్థానంలో కుల్దీప్‌ సేన్‌, షాబాజ్‌లను జట్టులోకి తీసుకున్నారు. కానీ సూర్యకుమార్‌ యాదవ్‌కు, సంజు శాంసన్‌కు మాత్రం మొండి చేయి చూపించారు. ఈ విషయంపైనే క్రికెట్‌ అభిమానులు తెగ‌ మండిపడుతున్నారు.

BCCI will not select Suryakumar Yadav for ODIs

BCCI will not select Suryakumar Yadav for ODIs

Suryakumar Yadav : కుల పిచ్చి..!

బీసీసీఐలో కులతత్వం రాజ్యమేలుతుందని.. అందుకే సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌లకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత.. ‘క్యాస్టిస్ట్‌ బీసీసీఐ’ అనే హ్యాష్‌ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. జట్టులో బ్రాహ్మణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని క్రికెట్‌ అభిమానులు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. సంజూ శాంస‌న్, సూర్య కుమార్‌కి మంచి టాలెంట్ ఉన్నా కూడా రెస్ట్ పేరుతో వారిని ప్ర‌తి సారి తొక్కేస్తున్నార‌ని కుల గ‌జ్జి ఎప్పుడు వ‌దులుతుందో అని కొంద‌రు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌పై బీసీసీఐ స్పందిస్తుందా అనేది చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది