Home » Exclusive » Cricket Fans Shouting Sara Tendulkar To Tease Shubman Gill Video Viral
Exclusive

Shubman Gill – Sara Tendulkar : సారా వదిన.. అంటూ శుభ్ మన్ గిల్ ముందు ప్రేక్షకుల రచ్చ.. విరాట్ కోహ్లీ కూడా ఎంకరేజ్ చేశాడు.. వీడియో వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 25, 2023 9:28 pm
Advertisement

Sara Tendulkar : న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే కదా. న్యూజిలాండ్, భారత్ సిరీస్ లో ఎక్కువగా చర్చకు వచ్చింది శుబ్ మన్ గిల్ బ్యాట్స్ మెన్. ఆయన బ్యాటింగే ఈ సిరీస్ లో హైలెట్. అసలు.. గిల్ రచ్చ రచ్చ చేశాడు. ఆయన ఆడిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఒక యంగ్ క్రికెటర్ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అనేది చాలా మంచి శుభసూచికం. నిజానికి.. ఒకప్పుడు సెంచరీ కొట్టాలంటే శుభ్ మన్ గిల్ చాలా కష్టపడేవాడు. కానీ… ఇప్పుడు వరుసగా సెంచరీలు బాదుతున్నాడు.

Advertisement

చివరి మ్యాచ్ లో రోహిత్ కు జోడిగా ఓపెనర్ గా గిల్ ను సెలెక్ట్ చేయడం కరెక్ట్ చాయిస్. దానికి తగ్గట్టుగా.. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు గిల్. సెంచరీల వర్షం కురిపిస్తున్న శుభ్ మన్ గిల్ ను చూసి ప్రేక్షకులు మాత్రం ఫిదా అయిపోతున్నారు. నిజానికి.. శుభ్ మన్ గిల్ సెంచరీలు కురిపించడంతో పాటు ఈ మధ్య బాగా ఇతర విషయాల్లోనూ వార్తల్లో నిలుస్తున్నాడు గిల్. అయితే.. శుభ్ మన్ గిల్.. సచిల్ టెండుల్కర్ కూతురు సారాతో డేటింగ్ చేస్తున్నాడంటూ

cricket fans shouting Sara Tendulkar to tease shubman gill video viral

Advertisement

Sara Tendulkar : సారా టెండుల్కర్ తో గిల్ డేటింగ్ చేస్తున్నాడా?

అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ.. అది నిజం కాదని కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో శుభ్ మన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా.. గిల్ తో సచిల్ కూతురు సారాకు నెటిజన్లు లింక్ పెడుతున్నారు. మ్యాచ్ లోనూ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గిల్ ను ఉద్దేశించి.. సారా సారా వదిన.. అంటూ అరిచేశారు ప్రేక్షకులు. వాళ్లకు మద్దతు ఇస్తున్నట్టుగా విరాట్ కూడా గిల్ ను టీజ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి