david warner full fire on sun risers hyderabad
David Warner : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ టీంకి కొంత కాలంగా ఆడుతూ వచ్చిన వార్నర్ ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా హైదరాబాదీస్‌కి బాగా దగ్గరయ్యాడు వార్నర్. అయితే ఈ క్రికెటర్‌ని ఎలాంటి కారణం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సన్‌రైజర్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చర్చనీయాశంగా మారింది. ఆ తర్వాత ఆటగాడిగా కూడా తప్పించారు. దీంతో ఇప్పటికీ చాలా నిరాశలో ఉన్నాడు వార్నర్. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో అవకాశం దొరికితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని అంటున్నాడు డేవిడ్ వార్నర్.
ఓ నెటిజన్ కామెంట్ కు .. ఛాన్స్ దొరికితే కచ్చితంగా సన్ రైజర్స్ పై సెంచరీ చేయడానికి ప్రయత్నిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వార్నర్ రిప్లైపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.2016 సీజన్‌లో టైటిల్ అందించిన వార్నర్‌ను ఇలా అవమానించడం ఆరెంజ్ ఫ్యాన్స్‌కి కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించింది.టైటిల్ ఫెవరెట్‌గా ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.ఆరంభంలో విజయం అంచుల దాకా వచ్చిన మ్యాచుల్లోనూ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో చేజేతులా ఓడింది సన్‌రైజర్స్… ఈ కారణంగానే టీమ్ సెలక్షన్ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం వేరే టీంకి ఆడుతున్న డేవిడ్ వార్నర్..
david warner full fire on sun risers hyderabad
ఛాన్స్ దొరికినప్పుడల్లా తన పగ తీర్చుకుంటాననేలా మాట్లాడుతున్నాడు.డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాదు… యాక్టింగ్ తోనూ అదరగొట్టేస్తున్నాడు. గ్యాప్ దొరికితే చాలు తెలుగు నిమా పాటకు స్టెప్పులేయడమో లేక డైలాగ్ చెప్పడమో చేస్తూ తనలోని నటుడిని బయటకు తెచ్చి అభిమానులకు చక్కటి ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు, అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ మూవీ అల వైకుంఠ పురంలోని సాంగ్స్ కు కాలు కదిపిన ఈ డాషింగ్ ఓపెనర్ పుష్ప పాటలకు , డైలాగ్స్‌కి కూడా అదరగొట్టాడు. డేవిడ్ వార్నర్ కాస్తా… డేవిడ్ రాజ్ లా మారిపోయి యాక్టింగ్ చించేస్తున్నాడు. గతంలో పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పిన వార్నర్… ఆ తర్వాత శ్రీవల్లి సాంగ్ కు స్టెప్పులు కూడా వేశాడు
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.