dj bravo immiates allu arjun srivalli song from pusha
Pushpa: పుష్ప చిత్రంలోని ప్రతి పాట శ్రోతలని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన సాంగ్స్‌కి మనదేశంలోనే కాదు ఇతర దేశాల వాళ్లు కూడా ఫిదా అవుతున్నారు. భారతదేశానికి చెందిన క్రీడాకారులే కాకుండా విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పుష్ప సాంగ్స్‌ను, డైలాగులను ఇమిటేట్ చేస్తూ అదరగొడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో కూడా చేరిపోయాడు. శ్రీవల్లి పాటకు వెస్టిండీస్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఆల్‌రౌండర్ డేజే బ్రావో తనదైన శైలిలో స్టెప్స్ వేసి అదరగొట్టాడు. పుష్ప మాదిరిగానే కళ్ల జోడు ధరించి, చెప్పులను ఉపయోగించి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు.
ఓ స్విమ్మింగ్‌ఫూల్ ప్రదేశంలో తీసిన వీడియోను పుష్ప టీం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి మురిసిపోయింది. 18 సెకన్లతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. బ్రావో ఐపీఎల్ ద్వారా మన ఇండియన్స్‌కి కూడా చాలా దగ్గరయ్యాడు. బ్రావోకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఈ సారి బ్రావో వేలంలో పాల్గొననున్నాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ జాబితాలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతు రాజ్ గైక్వాడ్‌కు చోటు లభించింది.
dj bravo immiates allu arjun srivalli song from pusha
ఇక పుష్ప సాంగ్స్‌కి వీడియోలు చేసిన వారిలో జడేజా, శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌తో పాటు పలువురు ఇండియన్స్ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రిమీయర్ లీగ్‌లోనూ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం మానియా కనిపించింది. ఈ లీగ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ ఇస్లాం ప్రజెంటేషన్ సెర్మనీ కార్యక్రమంలో మాట్లాడుతూ పుష్ప చిత్రం చూశానని, బాగుందని ప్రశంసలు కురిపించాడు. అలాగే అల్లు అర్జున్ మాదిరి మేనరిజంతో తగ్గెదేలే అని డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. రెండు పార్టులుగా రానున్న పుష్ప సెకండ్ పార్టు షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.