do not select kl rahul for the odi world cup under any circumstances
Team India : టీమిండియా జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్ టీంపై ఓడిపోయిన తర్వాత అసలు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. దీంతో క్రికెట్ ప్రేమికుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మాజీ క్రికెట్ ఆటగాళ్లు టీం మార్చాలని కోరుతున్నారు. సీనియర్లను తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య బంగ్లా టూర్ లో ఆడుతున్న టీమిండియా రెండు వన్డేలలో… పసికూన లాంటి బంగ్లాదేశ్ టీంపై ఓడిపోవడంతో మరింతగా విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ పరంగా లేదా బౌలింగ్ పరంగా అసలు ఏమాత్రం బంగ్లాదేశ్ కి ఫైట్ ఇవ్వలేకపోయారు.
టీమిండియాలో పేసర్లు గట్టిగా రాణిస్తున్న గాని తర్వాత రంగంలో దిగుతున్న బౌలర్లు ఏమాత్రం రాణించలేకపోతున్నారు. బౌలింగ్ పరంగా భారత్ బలహీనమని బంగ్లాదేశ్ తో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో రుజువయ్యింది. అయితే రెండో మ్యాచ్ ఓటమి కారణం కెప్టెన్ రాహుల్ కెప్టెన్సీ అని మండిపడుతున్నారు. అప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్… తీసుకుని నిర్ణయాలే బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లను క్రీజులో నిలదొక్కుకునేలా చేశాయనీ అంటున్నారు. బంగ్లా చేతిలో పోయిన మ్యాచ్ నీ ..మెహిదీ-మహ్మదుల్లా ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యంతో రన్స్ చేసి జట్టు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
do not select kl rahul for the odi world cup under any circumstances
మహ్మదుల్లా 77 రన్స్ చేసి అవుటైనా.. మెహిదీ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఏకంగా సెంచరీ బాదేశాడు. 69 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. 7 వికెట్లకు 271 పరుగులు చేసిందంటే.. అందుకు కారణం కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్ణయాలు అని క్రికెట్ లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టి20 వరల్డ్ కప్ లో కూడా కె.ఎల్ రాహుల్ ఏమీ రాణించలేదు. మరి ఇలాంటి ప్లేయర్ అని జట్టులో ఉంచుకొని అనవసరంగా టీం ఓడిపోవడానికి సెలెక్టర్లు కారణం అవుతున్నారని మండిపడుతున్నారు. ఇటువంటి ప్లేయర్స్ తో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు… ఆడితే ముందుగానే టీం ఇండియా ఇంటికొచ్చేయడం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ నీ వచ్చే ఏడాది వరల్డ్ కప్ టీమ్ లో ఉండకూడదు సెలెక్టర్లు… సెలెక్ట్ చేయొద్దు బాబోయ్ అని క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
Watermelon : దేశంలో వేసవి కాలం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు గడిచేకొద్దీ వేడి పెరుగుతోంది. ఈ మండే వేసవి…
Period : పీరియడ్ కడుపునొప్పి భరించలేనిదిగా ఉండొచ్చు. కానీ ఈ అసౌకర్య లక్షణాన్ని ఎదుర్కోవడానికి మీరు తీసుకోగల చిట్కాలు కొన్ని…
This website uses cookies.