India vs England : భారత్ నీ చిత్తుగా ఓడించి ఫైనల్ కి చేరిన ఇంగ్లాండ్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: November 10, 2022, 4:56 pm

India vs England : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియాని ఇంగ్లాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఇండియాని 168 పరుగులకు కట్టడి చేయడం జరిగింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది భారత్. అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొదటి ఓవర్ నుండి చాలా దూకుడుగా ఆడారు.

భారత్ పెసర్లను చితకబాదారు. తొలి ఆరు ఓవర్లలోనే (పవర్ ప్లే) 69 పరుగులు చేశారు. ఓపెనర్స్.. బట్లర్, హెల్స్… ఇండియా బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ… మ్యాచ్ వన్ సైడ్ చేసేసారు. ఒక వికెట్ పడకుండానే 169 పరుగుల లక్ష్యాన్ని… 16 ఓవర్లలోనే చేదించి.. రికార్డ్స్ పార్ట్నర్ షిప్పుతో ఇంగ్లాండ్ మ్యాచ్ నీ ఫైనల్ లో చేర్చారు.

England won by 10 wickets vs India

England won by 10 wickets vs India

 

బట్లర్ 80, హెల్స్ 86 పరుగులు సాధించారు. దీంతో నవంబర్ 13 వ తారీకు ఫైనల్ పాకిస్తాన్ తో ఇంగ్లాండ్ తలపడనుంది. ఆల్రెడీ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జరగగా .. పాక్ గెలవటం జరిగింది. దీంతో సెకండ్ సెమి ఫైనల్ ఇంగ్లాండ్ గెలవడంతో…T20 వరల్డ్ కప్ 2022 గెలవడానికి పాక్ మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ఫైనల్స్ లో తలపడనున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp