Chahal : ఔను.. వాళ్లిద్దరు విడిపోయారు.. చాహల్,ధనశ్రీ వర్మ విడిపోవడానికి కారణం ?
Chahal : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు కోర్టుకు వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ విడాకుల ఫైల్‌పై కోర్టు తీర్పు కోసం వారు కాసేపు వేచి చూశారు. కోర్టుకు వస్తున్న సమయంలో కొందరు వారి ఫొటోలను తీశారు. తమను ఎవరూ గుర్తుపట్టకూడదనుకున్నారో ఏమో వారిద్దరు ముఖాలకు పూర్తిగా మాస్కులు వేసుకుని వచ్చారు.
Chahal : ఔను.. వాళ్లిద్దరు విడిపోయారు.. చాహల్,ధనశ్రీ వర్మ విడిపోవడానికి కారణం ?
ప్లెయిన్ క్లాత్స్ ధరించారు. సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు. అయినప్పటికీ వారిని ఫొటోగ్రాఫర్లు ఈజీగా గుర్తుపట్టేశారు. వారి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ధనశ్రీ వర్మకు భరణంగా చాహల్ 4.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని తెలుస్తోంది. అందులో ఇప్పటికే 2.37 కోట్ల రూపాయలు ఇచ్చేశాడని సమాచారం.ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముందు వేచి ఉండాల్సిన వ్యవధిని కూలింగ్ పీరియడ్ అంటారు. చాహల్, ధనశ్రీ వర్మ వివాహం 2020లో జరిగింది.
సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు సమాచారం. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణకు గతంలోనూ చాహల్, ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారని తెలుస్తోంది. . ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున యుజ్వేంద్ర చాహల్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును నిన్న హైకోర్టు ఆదేశించగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు వచ్చాయి
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.