Chahal : ఔను.. వాళ్లిద్ద‌రు విడిపోయారు.. చాహ‌ల్‌,ధనశ్రీ వర్మ విడిపోవ‌డానికి కార‌ణం ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chahal : ఔను.. వాళ్లిద్ద‌రు విడిపోయారు.. చాహ‌ల్‌,ధనశ్రీ వర్మ విడిపోవ‌డానికి కార‌ణం ?

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Chahal : ఔను.. వాళ్లిద్ద‌రు విడిపోయారు.. చాహ‌ల్‌,ధనశ్రీ వర్మ విడిపోవ‌డానికి కార‌ణం ?

Chahal : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మకు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు కోర్టుకు వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ విడాకుల ఫైల్‌పై కోర్టు తీర్పు కోసం వారు కాసేపు వేచి చూశారు. కోర్టుకు వస్తున్న సమయంలో కొందరు వారి ఫొటోలను తీశారు. తమను ఎవరూ గుర్తుపట్టకూడదనుకున్నారో ఏమో వారిద్దరు ముఖాలకు పూర్తిగా మాస్కులు వేసుకుని వచ్చారు.

Chahal ఔను వాళ్లిద్ద‌రు విడిపోయారు చాహ‌ల్‌ధనశ్రీ వర్మ విడిపోవ‌డానికి కార‌ణం

Chahal : ఔను.. వాళ్లిద్ద‌రు విడిపోయారు.. చాహ‌ల్‌,ధనశ్రీ వర్మ విడిపోవ‌డానికి కార‌ణం ?

Chahal విడాకులు మంజూరు..

ప్లెయిన్‌ క్లాత్స్‌ ధరించారు. సన్‌ గ్లాసెస్‌ పెట్టుకున్నారు. అయినప్పటికీ వారిని ఫొటోగ్రాఫర్లు ఈజీగా గుర్తుపట్టేశారు. వారి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ధనశ్రీ వర్మకు భరణంగా చాహల్ 4.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని తెలుస్తోంది. అందులో ఇప్పటికే 2.37 కోట్ల రూపాయలు ఇచ్చేశాడని సమాచారం.ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముందు వేచి ఉండాల్సిన వ్యవధిని కూలింగ్ పీరియడ్ అంటారు. చాహల్‌, ధనశ్రీ వర్మ వివాహం 2020లో జరిగింది.

సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు సమాచారం. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణకు గతంలోనూ చాహల్‌, ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారని తెలుస్తోంది. . ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున యుజ్వేంద్ర చాహల్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును నిన్న హైకోర్టు ఆదేశించగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు వచ్చాయి

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది