Sourav Ganguly: టీం ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించడంపై అతని అభిమానులు మండి పడుతున్నారు. అకారణంగా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే, బీసీసీఐ టీం ఇండియా క్రికెటర్ల గురించి ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఓ కారణం ఉంటుంది. ఎందుకంటే సెలెక్టర్లతో పాటు సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాకే అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకుంటాడు. దీనంతటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. విరాట్ కోహ్లీ మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా తప్పుకుంటానని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే జట్టుకు మాత్రం అతనే కెప్టెన్‌గా కొనసాగాలి.
కానీ, అనుకోకుండా విరాట్‌ను తప్పించి వన్డే జట్టుకు కూడా రోహిత్ కెప్టెన్‌గా నియమించారు.టీం ఇండియాలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ప్రపంచ స్థాయి మెరుగైన ఆటగాళ్లలో కోహ్లీ పేరు తప్పకుండా ఉంటుంది. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20, టెస్టు జట్టుకు రథసారధి అయ్యాడు. అప్పటి నుంచి జట్టును తన భుజాలపై భారాన్ని మోస్తూ వచ్చాడు. అయితే, ఒత్తిడి కారణంగా ఇప్పటికే టెస్టు క్రికెట్ కెప్టెన్సీ వదులుకోగా, పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్పాలని భావించాడు. అనుకుంటే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా తప్పుకున్నాడు. కానీ, వన్డే కెప్టెన్ గా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐపై కోహ్లీ ఫ్యాన్స్ విరుచుకపడుతున్నారు.తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. విరాట్ తొమ్మిదేళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్నాడు. ఐదేళ్ల నుంచి కెప్టెన్‌గా కొనసాగాడు. అతనిపై ఎంతో ఒత్తిడి పెరిగింది. ఫలితంగా అది అతని ఆటపై ప్రభావం చూపుతోంది. అందుకే టీ 20లకు కెప్టెన్‌గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేలకు కొనసాగుతానన్నాడు. కానీ, సెలెక్టర్లు మాత్రం వైట్ బాల్‌తో ఆడే టీ20, వన్డేలకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కోహ్లీకి చెబితే సానుకూలంగా స్పందించాడు. అందుకే కోహ్లిని తప్పించి అతని స్థానంలో రోహిత్‌కు బాధ్యతలు అప్పగించామని గంగూలీ వెల్లడించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.