Sourav Ganguly : కెప్టెన్‌గా కోహ్లీని అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sourav Ganguly : కెప్టెన్‌గా కోహ్లీని అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ..!

Sourav Ganguly: టీం ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించడంపై అతని అభిమానులు మండి పడుతున్నారు. అకారణంగా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే, బీసీసీఐ టీం ఇండియా క్రికెటర్ల గురించి ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఓ కారణం ఉంటుంది. ఎందుకంటే సెలెక్టర్లతో పాటు సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాకే అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకుంటాడు. దీనంతటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. విరాట్ కోహ్లీ మొన్న జరిగిన టీ20 […]

 Authored By mallesh | The Telugu News | Updated on :13 December 2021,8:20 pm

Sourav Ganguly: టీం ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించడంపై అతని అభిమానులు మండి పడుతున్నారు. అకారణంగా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే, బీసీసీఐ టీం ఇండియా క్రికెటర్ల గురించి ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఓ కారణం ఉంటుంది. ఎందుకంటే సెలెక్టర్లతో పాటు సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాకే అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకుంటాడు. దీనంతటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. విరాట్ కోహ్లీ మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా తప్పుకుంటానని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే జట్టుకు మాత్రం అతనే కెప్టెన్‌గా కొనసాగాలి.

కానీ, అనుకోకుండా విరాట్‌ను తప్పించి వన్డే జట్టుకు కూడా రోహిత్ కెప్టెన్‌గా నియమించారు.టీం ఇండియాలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ప్రపంచ స్థాయి మెరుగైన ఆటగాళ్లలో కోహ్లీ పేరు తప్పకుండా ఉంటుంది. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20, టెస్టు జట్టుకు రథసారధి అయ్యాడు. అప్పటి నుంచి జట్టును తన భుజాలపై భారాన్ని మోస్తూ వచ్చాడు. అయితే, ఒత్తిడి కారణంగా ఇప్పటికే టెస్టు క్రికెట్ కెప్టెన్సీ వదులుకోగా, పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్పాలని భావించాడు. అనుకుంటే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా తప్పుకున్నాడు. కానీ, వన్డే కెప్టెన్ గా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐపై కోహ్లీ ఫ్యాన్స్ విరుచుకపడుతున్నారు.తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.

Sourav Ganguly clarifies over skipping virat kohli as odi captain

Sourav Ganguly clarifies over skipping virat kohli as odi captain

Sourav Ganguly : కోహ్లీని అందుకే తప్పించాం..

 ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. విరాట్ తొమ్మిదేళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్‌ ఆడుతున్నాడు. ఐదేళ్ల నుంచి కెప్టెన్‌గా కొనసాగాడు. అత‌నిపై ఎంతో ఒత్తిడి పెరిగింది. ఫలితంగా అది అతని ఆటపై ప్రభావం చూపుతోంది. అందుకే టీ 20ల‌కు కెప్టెన్‌గా కోహ్లి తప్పుకున్నాడు. వ‌న్డేల‌కు కొన‌సాగుతాన‌న్నాడు. కానీ, సెలెక్టర్లు మాత్రం వైట్ బాల్‌తో ఆడే టీ20, వ‌న్డేల‌కు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కోహ్లీకి చెబితే సానుకూలంగా స్పందించాడు. అందుకే కోహ్లిని తప్పించి అతని స్థానంలో రోహిత్‌కు బాధ్యతలు అప్పగించామని గంగూలీ వెల్లడించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది