Glenn Maxwell : ఇంటి బాట ప‌ట్టినందుకు మ్యాక్స్‌వెల్ బూతుల రచ్చ‌… త‌ప్పుప‌డుతున్న సీనియ‌ర్ క్రికెట‌ర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Glenn Maxwell : ఇంటి బాట ప‌ట్టినందుకు మ్యాక్స్‌వెల్ బూతుల రచ్చ‌… త‌ప్పుప‌డుతున్న సీనియ‌ర్ క్రికెట‌ర్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :6 November 2022,11:20 am

Glenn Maxwell : ప్ర‌స్తుతం టీ 20 వ‌రల్డ్ క‌ప్ టోర్నీ ఎంత రంజుగా సాగుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. సెమీస్‌కి చేరేందుకు అన్ని టీంస్ గ‌ట్టిగా ఫైట్ చేస్తున్నాయి. గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌కి చేరిన విష‌యం తెలిసిందే. సూపర్-12 దశలోనే ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ ఏడు పాయింట్లు సాధించింది. అయితే, ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ రన్‌రేట్ ఎక్కువగా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది.  గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.

ఇప్పటికే సెమీస్ చేరిన న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఇక గ్రూప్-2 నుంచి ఇండియా సెమీస్‌కి వెళ్ల‌గా, మ‌రి కొద్ది నిమిషాల‌లో రెండో టీం ఏద‌న్న‌ది తెలిపోతుంది. అయితే ఆస్ట్రేలియా సెమీస్‌కి కూడా చేర‌కుండా బ‌య‌ట‌కు రావ‌డం అభిమానుల‌తో పాటు ఆట‌గాళ్ల‌ని కూడా క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఆస్ట్రేలియా ఓటములకు పునాది న్యూజిలాండ్‌ వేసింది. తొలి మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ తర్వాత శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్నే నమోదు చేసింది. కానీ, మూడో మ్యాచ్‌ మాత్రం వర్షార్పణం అయ్యింది. అందువల్ల గెలిచుంటే ఒక పాయింట్‌ ఎక్కువే ఉండేది. కానీ, వర్షం కూడా వీరి ఓటమిలో కీలక పాత్ర పోషించింది.

Glenn Maxwell toung slipped

Glenn Maxwell toung slipped

Glenn Maxwell :ఎందుకిలా మాట్లాడాడు..

ఇక ఆఫ్గనిస్తాన్‌ జట్టు మాత్రం ఆస్ట్రేలియా నెట్ రన్‌ రేట్‌పై గట్టి దెబ్బే కొట్టింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి పరుగు ఆస్ట్రేలియాని సెమీస్‌కు దూరం చేయడంలో కీలకంగా మారాయి. అయితే ఈ పరాజయం పట్ల జట్టు, ఫ్యాన్స్ ఎలా స్పందించినా కూడా మ్యాక్స్‌ వెల్‌ పేరు మాత్రం వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా వేదికగా బగ్గర్‌(పెద్ద బూతు) అంటూ ట్వీట్‌ చేశాడు. అయతే అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ, నెట్టింట మాత్రం ఎవరికి తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది