GT Vs MI : గుజరాత్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నెహ్రా పిల్లలు... వైరల్ వీడియో !
శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 20 పరుగులు తేడాతో పరాజయం కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది అనే చెప్పాలి.. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ దారుణమైన ఓటమి చవి చూసింది. గుజరాత్ ఓటమి తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కూతురు, కొడుకు బోరున విలపించారు. శుభ్‌మన్ గిల్ సోదరి కూడా గుజరాత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ సమయంలో షహ్నీల్ గిల్ కూడా ఆశిష్ నెహ్రా కూతురిని శాంతింపిజేస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో ఆమె కూడా భావోద్వేగానికి లోనైంది.
GT Vs MI : గుజరాత్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నెహ్రా పిల్లలు… వైరల్ వీడియో !
పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ గత రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓటమి కారణంగా వారు ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్క ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ముంబై జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో కలిసి 7.1 ఓవర్లలో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తర్వాత బెయిర్‌స్టో 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ రోహిత్ శర్మ 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. రోహిత్ కీలక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఈ క్రమంలో గుజరాత్ ఆటగాళ్లు కాస్తా ఆందోళనకు గురయ్యారు.ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు చేసినప్పటికీ గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానకి 208 పరుగులు మాత్రమే చేసి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.