
SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..?
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కి మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాలు, తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో మరింత మంటెత్తించాయి. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోవడం, అందులో ముఖ్యంగా బలహీనమైన పిచ్ పాత్రను పోషించిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ .. ఈ పిచ్ సంప్రదాయ హైదరాబాద్ వికెట్‌లా కాకుండా చాలా స్లోగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..?
ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ నాణ్యతపై అభిమానులతో పాటు విశ్లేషకులు, కామెంటేటర్లూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లను తయారు చేసే హెచ్‌సీఏ, ఈసారి సడెన్‌గా స్పిన్, స్లో ట్రాక్‌ను సిద్ధం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో హెచ్‌సీఏ–సన్‌రైజర్స్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని గుర్తు చేస్తూ, దీనికి ప్రతీకారమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాస్‌ల వివాదం కారణంగా సన్‌రైజర్స్ హెచ్‌సీఏపై మెయిల్ చేయడం, అనంతరం సీఎం జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు క్రికెట్ రాజకీయాలను రంగరించాయి.
ఇలాంటి నేపథ్యంలో తొలి హోం మ్యాచ్ కోసం సన్‌రైజర్స్‌కు అననుకూలంగా స్లో వికెట్ సిద్ధం చేయడం, మ్యాచ్‌లో వారు ఘోర పరాజయం పాలవడం, సోషల్ మీడియాలో హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలకు దారితీసింది. విశ్లేషకులు చెబుతున్నట్లు సన్‌రైజర్స్ ప్రధాన బలమైన బ్యాటింగ్‌ను నిర్లక్ష్యం చేసేలా పిచ్ తయారవడమే కాకుండా, హోమ్ అడ్వాంటేజ్‌ను కోల్పోయేలా చేసింది. ఇదంతా ఉద్దేశపూర్వకమేనా? అనే అనుమానాలు బలపడుతుండగా, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు మాత్రం మ్యాచ్ నిర్వహణకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. అయినా విమర్శలు మాత్రం తగ్గట్లేదు.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.