SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..?

SRH  : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కి మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాలు, తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో మరింత మంటెత్తించాయి. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోవడం, అందులో ముఖ్యంగా బలహీనమైన పిచ్ పాత్రను పోషించిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ .. ఈ పిచ్ సంప్రదాయ హైదరాబాద్ వికెట్‌లా కాకుండా చాలా స్లోగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా

SRH ఓటమికి కారణం హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయమేనా..?

SRH  సన్‌రైజర్స్‌పై హెచ్‌సీఏ రివేంజ్ తీర్చుకుందా ?

ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ నాణ్యతపై అభిమానులతో పాటు విశ్లేషకులు, కామెంటేటర్లూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లను తయారు చేసే హెచ్‌సీఏ, ఈసారి సడెన్‌గా స్పిన్, స్లో ట్రాక్‌ను సిద్ధం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో హెచ్‌సీఏ–సన్‌రైజర్స్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని గుర్తు చేస్తూ, దీనికి ప్రతీకారమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాస్‌ల వివాదం కారణంగా సన్‌రైజర్స్ హెచ్‌సీఏపై మెయిల్ చేయడం, అనంతరం సీఎం జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు క్రికెట్ రాజకీయాలను రంగరించాయి.

ఇలాంటి నేపథ్యంలో తొలి హోం మ్యాచ్‌ కోసం సన్‌రైజర్స్‌కు అననుకూలంగా స్లో వికెట్ సిద్ధం చేయడం, మ్యాచ్‌లో వారు ఘోర పరాజయం పాలవడం, సోషల్ మీడియాలో హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలకు దారితీసింది. విశ్లేషకులు చెబుతున్నట్లు సన్‌రైజర్స్ ప్రధాన బలమైన బ్యాటింగ్‌ను నిర్లక్ష్యం చేసేలా పిచ్‌ తయారవడమే కాకుండా, హోమ్ అడ్వాంటేజ్‌ను కోల్పోయేలా చేసింది. ఇదంతా ఉద్దేశపూర్వకమేనా? అనే అనుమానాలు బలపడుతుండగా, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు మాత్రం మ్యాచ్ నిర్వహణకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. అయినా విమర్శలు మాత్రం తగ్గట్లేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది