Pakistan Actress : ఇండియాను ఓడిస్తే జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన పాకిస్థాన్ నటి
Pakistan Actress : ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. యూత్ అయితే రోజూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా. అయితే.. ఈ ఆదివారం.. జింబాబ్వే జట్టుతో ఇండియాకు మ్యాచ్ ఉంది. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఇక సెమీస్ కు చేరుకున్నట్టే. అందుకే ఈ మ్యాచ్.. భారత్ కు చాలా కీలకం.
అందుకే.. భారత్ ను ఎలాగైనా ఓడించి.. సెమీస్ కు వెళ్లకుండా ఆపడానికి పలు ఇతర టీమ్స్ కూడా అనుకుంటాయి. కానీ.. ఒక సినిమా నటి భారత్ ఓడిపోవాలని కోరుకుంది. అది దాయాది పాకిస్థాన్ కు చెందిన సెహర్ షిన్వారీ అనే నటి భారత్ ఓడిపోవాలని.. ఒకవేళ ఆదివారం జరగబోయే మ్యాచ్ లో జింబాబ్వే.. భారత్ ను ఓడిస్తే.. జింబాబ్వేకు చెందిన వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటా అంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. పాకిస్థాన్ కు చెందిన ఈ నటి.. ఎప్పుడూ భారత్ పై ఏడుస్తూనే ఉంటుంది.

i will marry zimbabwean guy if it wins on india says pakistan actress
Pakistan Actress : సెహర్ షిన్వారీ ట్వీట్ వైరల్
ఇదివరకు కూడా ఒకసారి ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఇండియా ఓడిపోవాలంటూ ట్వీట్లు చేసింది. టీమ్ ఇండియాపై చాలా సార్లు పలు విధాలుగా విమర్శలు చేసిన సెహర్.. తాజాగా మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కింది. తను చేసిన ఆ ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే.. భారత్ క్రికెట్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా సెహర్ ను ట్రోల్ చేస్తున్నారు. అలా అయితే.. ఇక మీరు జీవితాంతం పెళ్లి చేసుకోరు. ఇక మీరు కన్యగానే మిగిలిపోతారు.. అంటూ నెటిజన్లు తనతో ఆడుకుంటున్నారు. భారత్ గెలిస్తే మీరు ఏం చేస్తారు.. అంటూ పలువురు నెటిజన్లు తనను ప్రశ్నించారు.