icc shared interesting video of ms dhoni
MS Dhoni : దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పై పాకిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు అయింది. టీమిండియా క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్ పేలవంగా ఉండటంతో పాటు ఓపెనర్లు ఆదిలోనే విఫలమయ్యారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఓపెనర్లు కెప్టెన్ అజమ్ బాబర్, రిజ్వాన్ చెలరేగిపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా భారత్‌పై పాక్ ఘన విజయం సాధించేలా చేశారు. దాయాది దేశం పాకిస్థన్ చేతిలో భారత్ ఓడిపోవడం పట్ల క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు.
icc shared interesting video of ms dhoni
ఈ సంగతులు పక్కనబెడితే.. మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా టీ 20 వరల్డ్ కప్ మ్యాచెస్‌కు మెంటార్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని పాక్ క్రికెటర్స్‌తో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో ధోని పాకిస్థాన్ క్రికెటర్స్‌తో ముచ్చటిస్తున్నాడు. ‘బయట ఉన్నదంతా ఉట్టి హైపేనని, భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న నిజమైన కథ ఇదే’ననే క్యాప్షన్‌తో పాటు స్పిరిట్ ఆఫ్ క్రికెట్, టీ 20 వరల్డ్ కప్ హ్యాష్ ట్యాగ్స్‌తో ఐసీసీ షేర్ చేసింది ఈ వీడియో.
ఇకపోతే ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘రెస్పెక్ట్ మ్యాన్ ధోని’, ‘పాలిటిక్స్ ప్రభుత్వాలకు వదిలేయండి.. క్రికెట్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు వదిలేయండి’,‘బాబర్ అండ్ ధోని ఫేవరెట్స్’ అని కామెంట్స్ చేస్తున్నారు. లవ్ యూ ధోని ఫ్రమ్ పాకిస్థాన్ ఫ్యాన్స్ అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.