MS Dhoni : ఘోర పరాభవం తర్వాత పాక్ క్రికెటర్లతో ధోని ముచ్చట.. వీడియో వైరల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MS Dhoni : ఘోర పరాభవం తర్వాత పాక్ క్రికెటర్లతో ధోని ముచ్చట.. వీడియో వైరల్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :25 October 2021,1:21 pm

MS Dhoni : దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పై పాకిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు అయింది. టీమిండియా క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్ పేలవంగా ఉండటంతో పాటు ఓపెనర్లు ఆదిలోనే విఫలమయ్యారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఓపెనర్లు కెప్టెన్ అజమ్ బాబర్, రిజ్వాన్ చెలరేగిపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా భారత్‌పై పాక్ ఘన విజయం సాధించేలా చేశారు. దాయాది దేశం పాకిస్థన్ చేతిలో భారత్ ఓడిపోవడం పట్ల క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు.

icc shared interesting video of ms dhoni

icc shared interesting video of ms dhoni

MS Dhoni : పాక్ క్రికెటర్‌కు ధోని షేక్ హ్యాండ్..

ఈ సంగతులు పక్కనబెడితే.. మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా టీ 20 వరల్డ్ కప్ మ్యాచెస్‌కు మెంటార్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని పాక్ క్రికెటర్స్‌తో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో ధోని పాకిస్థాన్ క్రికెటర్స్‌తో ముచ్చటిస్తున్నాడు. ‘బయట ఉన్నదంతా ఉట్టి హైపేనని, భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న నిజమైన కథ ఇదే’ననే క్యాప్షన్‌తో పాటు స్పిరిట్ ఆఫ్ క్రికెట్, టీ 20 వరల్డ్ కప్ హ్యాష్ ట్యాగ్స్‌తో ఐసీసీ షేర్ చేసింది ఈ వీడియో.

ఇకపోతే ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘రెస్పెక్ట్ మ్యాన్ ధోని’, ‘పాలిటిక్స్ ప్రభుత్వాలకు వదిలేయండి.. క్రికెట్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు వదిలేయండి’,‘బాబర్ అండ్ ధోని ఫేవరెట్స్’ అని కామెంట్స్ చేస్తున్నారు. లవ్ యూ ధోని ఫ్రమ్ పాకిస్థాన్ ఫ్యాన్స్ అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది