Ind Vs Aus : ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఎంతటి మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ ముందు ఊరించే లక్ష్యం నమోదైంది. 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. చివరి రోజు ఆటలో ఇంకా 56 ఓవర్ల ఆట మిగిలింది. వర్షం అంతరాయం కలిగించకుండా ఉండకుండా 56 ఓవర్ల ఆట సాగితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఐదో రోజు మాత్రం స్టేడియం దగ్గర ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వల్ల అంపైర్లు ఆటను నిలిపేశారు. తర్వాత కాసేపటికే జోరుగా వర్షం కురిసింది.
చివరి రోజు కూడా ఉదయం 4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టీమిండియా తన చివరి వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (31)ను ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు. బుమ్రాతో కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన ఆకాశ్ దీప్.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. బుమ్రా 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆటని ఆపివేయడానికి గల కారణాన్ని అంపైర్ సైమన్ టాఫెల్ వివరించాడు.. ఐసీసీ 30-30 మెరుపుల నిబంధన ప్రకారం ఓ మెరుపు కనిపించి 30 సెకన్లలోపు పిడుగుపాటు శబ్దం వినిపిస్తే వెంటనే ఆట ఆపేయాలి. అంపైర్లు గబ్బా స్టేడియంలో అదే చేశారు. ఒకవేళ తుఫాను దూరంగా వెళ్లిపోతూ, 30 సెకన్లకు కాస్త అటూఇటూగా ఈ పిడుగుపాటు జరిగితే అంపైర్లు తమ విచక్షణ మేరకు ఆటను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చట
గబ్బా స్టేడియంలో మెరుపు చాలా దగ్గరగా కనిపించిందని, 30 సెకన్లలోపే పిడుగు పడిన శబ్దం రావడంతో ఆటను అంపైర్లు నిలిపేసినట్లు చెప్పాడు. ఇది ప్లేయర్స్, అఫీషియల్స్, గ్రౌండ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రత కోసం తీసుకొచ్చిన నిబంధన అని తెలిపాడు. నవంబర్ లో పాకిస్థాన్ టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు తొలి టీ20 మ్యాచ్ ఈ పిడుగుపాటు వల్ల ఆలస్యమైంది. ఆ మ్యాచ్ కూడా గబ్బా స్టేడియంలోనే జరగడం గమనార్హం.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/18), ఆకాశ్ దీప్(2/28), మహమ్మద్ సిరాజ్(2/38) నిప్పులు చెరగడంతో ఆసీస్ 85 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఆ జట్టు డిక్లేర్ చేసింది. Ind Vs Aus australia and india Test match drawn ,
TTD : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ దర్శనానికి ముఖ్యమైన ఏర్పాట్లను ప్రకటించింది. జనవరి…
Ashwin : ఇటీవల చాలా మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా…
Cancer Vaccine : ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ. రష్యా ప్రభుత్వం తన స్వంత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు…
Winter : చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో నారింజ పండ్ల లాంటివి తినడానికి వెనకాడుతారు. ఎందుకంటే జలుబు,దగ్గు, ఫ్లూ,…
Phone And Laptop : ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ కి లేదా ఫోన్లకి అతుక్కొని పోతున్నారు. ఇలా…
2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి.…
Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక పథకాలు తీసుకొస్తూ…
Chukkakur : ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆకుకూరలో ఒకటైన ఆకు కూర చుక్కకూర. ఈ…
This website uses cookies.