Ind vs Aus : చుక్క‌లు చూపించిన‌ రిష‌బ్ పంత్.. బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind vs Aus : చుక్క‌లు చూపించిన‌ రిష‌బ్ పంత్.. బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

 Authored By sandeep | The Telugu News | Updated on :4 January 2025,12:01 pm

ప్రధానాంశాలు:

  •  Ind vs Aus : చుక్క‌లు చూపించిన‌ రిష‌బ్ పంత్.. బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Ind vs Aus : భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు ర‌సవ‌త్త‌రంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 185 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం ఆట ప్రారంభించిన కంగారూ జట్టు వెంట‌వెంట‌నే వికెట్ల‌ని కోల్పోయింది. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న బ్యూ వెబ్‌స్టర్ అత్యధిక స్కోరు 57 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ తలో 2 వికెట్లు తీశారు.

Ind vs Aus చుక్క‌లు చూపించిన‌ రిష‌బ్ పంత్ బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ

Ind vs Aus : చుక్క‌లు చూపించిన‌ రిష‌బ్ పంత్.. బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Ind vs Aus చుక్క‌లు చూపించాడు..

అయితే ఈ మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ముఖ్యంగా రిష‌బ్ పంత్ అటాకింగ్ గేమ్‌తో అద‌ర‌గొట్టాడు. 33 బంతుల్లో 61 ప‌రుగులు చేసాడు. ఉన్నంత సేపు ఆసీస్ బౌల‌ర్స్‌కి చుక్క‌లు చూపించాడు. అయితే క‌మ్మిన్స్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని త‌ప్పుగా అంచ‌నా వేసి ఔట్ అయ్యాడు.

ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ ఔటైన తీరు విమ‌ర్శ‌లు గుప్పించేలా చేస్తుంది. ఆఖరి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. 12 బంతులాడి ఓ బౌండరీ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 9 ఇన్నింగ్స్‌లు ఆడగా.. 8 సార్లు ఔటయ్యాడు. ఒకసారి అజేయ శతకంతో నిలిచాడు. ఈ 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే పెవిలియన్ చేరాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది