IND vs ENG : ఇంగ్లాండ్ మరియు టీమిండియా మధ్య ధర్మశాల వేదికగా 5వ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండు పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ప్రదర్శనతో తర్వాత బౌలింగ్ ప్రదర్శనతో భారత జట్టు చెలరేగి ఆడింది. దీంతో బ్రిటిష్ జట్టు 5వ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. అయితే ఇప్పటికే 3 -1 తో సిరీస్ దక్కించుకున్న టీమిండియా 5వ సిరీస్ గెలుపుతో తన ఆదిక్యాన్ని 4-1 పెంచుకుంది.బౌలింగ్ ప్రదర్శనలో అశ్విన్ , కుల్దీప్ యాదవ్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ భూమ్రా చెలరేగారు. తొలుత అశ్విన్ బ్రిటిష్ బ్యాటర్ల పని పట్టగా ఆ తర్వాత కుల్దీప్ ఆ జోరుని కొనసాగిస్తూ వచ్చారు.ఇక బుమ్రా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ముఖ్యపాత్ర వహించాడు. ఇక ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు యంగ్ ప్లేయర్ సుబ్ మన్ గిల్ శతకాలతో కదం తొక్కిన వేళ ధర్మశాల దద్దరిల్లింది. ధర్మశాల వేదికగా జరిగిన ఇంగ్లాండ్ భారత్ 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 218 పరుగుల కి ఆల్ అవుట్ కాగా భారత్ ఇన్నింగ్స్ లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 103 పరుగులు సుబ్ మన్ గిల్ 110 పరుగులు సాధించారు . అదేవిధంగా దేవదత్తు పడిక్కల్ , సర్పరాజ్ కాన్ ఆప్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. తన మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లోనే పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్పరాజు 56 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత జడేజా, అశ్విన్ , ధ్రువ్ జురేల్ స్వల్ప పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం చివరిలో వచ్చిన కుల్దీప్ యాదవ్ మరియు బుమ్రా ,ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. చివరకు 477 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగియడం జరిగింది.
అనంతరం 259 పరుగుల లోటు తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లో కూడా సతీకెల పడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్స్ బ్రిటిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత జట్టు నుండి అశ్విన్ కుల్దీప్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ బుమ్రా బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. వరుసగా వికెట్లను పడగొడుతూ బ్యాటర్లను క్విజ్ లో నిలవకుండా చేశారు. ఈ క్రమంలోనే 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండు ను కష్టాలలోకి నెట్టేశారు. ఇక అశ్విన్ విజృంభించి బౌలింగ్ వేయడంతో బ్రిటిష్ జట్టు 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హార్ట్ లీ రూట్ ఇంగ్లాండ్ జట్టు బయటపడే ప్రయత్నం చేసినప్పటికీ బూమ్రా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ఆ అవకాశం లేకుండా చేశాడు. ఈ విధంగా వరుసగా 189 పురుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్ కూడా కోల్పోయి ఆల్ అవుట్ అయ్యింది. దీంతో భారత్ జట్టుకు ఇన్నింగ్స్ విజయం దక్కింది.
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
This website uses cookies.