IND vs ENG : 5వ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IND vs ENG : 5వ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం..!

 Authored By tech | The Telugu News | Updated on :9 March 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  IND vs ENG : 5వ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం..!

IND vs ENG  : ఇంగ్లాండ్ మరియు టీమిండియా మధ్య ధర్మశాల వేదికగా 5వ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండు పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ప్రదర్శనతో తర్వాత బౌలింగ్ ప్రదర్శనతో భారత జట్టు చెలరేగి ఆడింది. దీంతో బ్రిటిష్ జట్టు 5వ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. అయితే ఇప్పటికే 3 -1 తో సిరీస్ దక్కించుకున్న టీమిండియా 5వ సిరీస్ గెలుపుతో తన ఆదిక్యాన్ని 4-1 పెంచుకుంది.బౌలింగ్ ప్రదర్శనలో అశ్విన్ , కుల్దీప్ యాదవ్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ భూమ్రా చెలరేగారు. తొలుత అశ్విన్ బ్రిటిష్ బ్యాటర్ల పని పట్టగా ఆ తర్వాత కుల్దీప్ ఆ జోరుని కొనసాగిస్తూ వచ్చారు.ఇక బుమ్రా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ముఖ్యపాత్ర వహించాడు. ఇక ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

IND vs ENG  తొలి ఇన్నింగ్స్…

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు యంగ్ ప్లేయర్ సుబ్ మన్ గిల్ శతకాలతో కదం తొక్కిన వేళ ధర్మశాల దద్దరిల్లింది. ధర్మశాల వేదికగా జరిగిన ఇంగ్లాండ్ భారత్ 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 218 పరుగుల కి ఆల్ అవుట్ కాగా భారత్ ఇన్నింగ్స్ లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 103 పరుగులు సుబ్ మన్ గిల్ 110 పరుగులు సాధించారు . అదేవిధంగా దేవదత్తు పడిక్కల్ , సర్పరాజ్ కాన్ ఆప్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. తన మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లోనే పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్పరాజు 56 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత జడేజా, అశ్విన్ , ధ్రువ్ జురేల్ స్వల్ప పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం చివరిలో వచ్చిన కుల్దీప్ యాదవ్ మరియు బుమ్రా ,ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. చివరకు 477 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగియడం జరిగింది.

అనంతరం 259 పరుగుల లోటు తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లో కూడా సతీకెల పడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్స్ బ్రిటిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత జట్టు నుండి అశ్విన్ కుల్దీప్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ బుమ్రా బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. వరుసగా వికెట్లను పడగొడుతూ బ్యాటర్లను క్విజ్ లో నిలవకుండా చేశారు. ఈ క్రమంలోనే 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండు ను కష్టాలలోకి నెట్టేశారు. ఇక అశ్విన్ విజృంభించి బౌలింగ్ వేయడంతో బ్రిటిష్ జట్టు 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హార్ట్ లీ రూట్ ఇంగ్లాండ్ జట్టు బయటపడే ప్రయత్నం చేసినప్పటికీ బూమ్రా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ఆ అవకాశం లేకుండా చేశాడు. ఈ విధంగా వరుసగా 189 పురుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్ కూడా కోల్పోయి ఆల్ అవుట్ అయ్యింది. దీంతో భారత్ జట్టుకు ఇన్నింగ్స్ విజయం దక్కింది.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది