IPL 2022 Ambati Rayudu dives full length to his right to pluck a brilliant catch
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుంటూరు కుర్రోడు అంబటి రాయడు మెరిశాడు. బ్యాటింగ్ ఫామ్ అందుకోలేకపోతున్న రాయుడు ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తెలుగు తేజం అంబటి రాయుడు స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు. ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదండోయ్ క్యాచ్ లకే రారాజు లాంటి క్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఇటువంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే నమ్మండి. రవీంద్ర జడేజా 16వ ఓవర్ అది. షార్ట్ గుడ్ లెంగ్త్ బాల్ వేశాడు. అటు ఆర్సీబీ ఆటగాడు ఆకాష్ దీప్ షార్ట్ కవర్ ఏరియా వైపు ఆడాడు.
అంతే..ఆ బాల్‌కు దాదాపు 6 అడుగుల దూరంలో ఉన్న అంబటి రాయుడు ఒక్కసారిగా డేగలా ఎగిరాడు. మనిషి పూర్తిగా పడుకుని ఉండేట్టు అడ్డంగా గాల్లో ఎగిరాడు. గ్రౌండ్‌కు 2 అడుగుల ఎత్తులో గాలిలో లేచి..తన కుడిచేతిని ముందుకు చాచి..ఒక్క చేత్తో డేగలా క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్ చూసి అందరూ చాలాసేపటి వరకూ తేలుకోలేకపోయారు. ఫుల్ లెంగ్త్ డ్రైవ్ చేస్తూ..ఒక్క చేత్తో పట్టిన అద్బుతమైన క్యాచ్. అనితర సాధ్యమైన క్యాచ్‌ను పట్టిన అంబటి రాయుడిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ క్యాచ్ అసలు ఎలా పట్టగలిగావంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2022 Ambati Rayudu dives full length to his right to pluck a brilliant catch
ఇక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ గా రవీంద్ర జడేజా కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 217 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత వరకు బెంగళూరు జట్టే విజయం సాధించేలా కనిపించింది. అయితే 18వ ఓవర్ లో అద్భుత బంతితో దినేశ్ కార్తీక్ ను అవుట్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాయం అయింది. షాబాజ్ అహ్మద్ (27 బంతుల్లో 41; 4 ఫోర్లు) బెంగళూరు ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.