IPL 2022 : గాల్లోకి ప‌క్షిలా ఎగిరి క్యాచ్ ప‌ట్టిన అంబటి రాయడు.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

IPL 2022 : గాల్లోకి ప‌క్షిలా ఎగిరి క్యాచ్ ప‌ట్టిన అంబటి రాయడు.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..!

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుంటూరు కుర్రోడు అంబటి రాయడు మెరిశాడు. బ్యాటింగ్ ఫామ్ అందుకోలేక‌పోతున్న రాయుడు ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టాడు. డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తెలుగు తేజం అంబటి రాయుడు స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు. ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదండోయ్ క్యాచ్ లకే రారాజు లాంటి క్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఇటువంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 April 2022,1:00 pm

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుంటూరు కుర్రోడు అంబటి రాయడు మెరిశాడు. బ్యాటింగ్ ఫామ్ అందుకోలేక‌పోతున్న రాయుడు ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టాడు. డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తెలుగు తేజం అంబటి రాయుడు స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు. ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదండోయ్ క్యాచ్ లకే రారాజు లాంటి క్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఇటువంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే నమ్మండి. రవీంద్ర జడేజా 16వ ఓవర్ అది. షార్ట్ గుడ్ లెంగ్త్ బాల్ వేశాడు. అటు ఆర్సీబీ ఆటగాడు ఆకాష్ దీప్ షార్ట్ కవర్ ఏరియా వైపు ఆడాడు.

అంతే..ఆ బాల్‌కు దాదాపు 6 అడుగుల దూరంలో ఉన్న అంబటి రాయుడు ఒక్కసారిగా డేగలా ఎగిరాడు. మనిషి పూర్తిగా పడుకుని ఉండేట్టు అడ్డంగా గాల్లో ఎగిరాడు. గ్రౌండ్‌కు 2 అడుగుల ఎత్తులో గాలిలో లేచి..తన కుడిచేతిని ముందుకు చాచి..ఒక్క చేత్తో డేగలా క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్ చూసి అందరూ చాలాసేపటి వరకూ తేలుకోలేకపోయారు. ఫుల్ లెంగ్త్ డ్రైవ్ చేస్తూ..ఒక్క చేత్తో పట్టిన అద్బుతమైన క్యాచ్. అనితర సాధ్యమైన క్యాచ్‌ను పట్టిన అంబటి రాయుడిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ క్యాచ్ అసలు ఎలా పట్టగలిగావంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2022 Ambati Rayudu dives full length to his right to pluck a brilliant catch

IPL 2022 Ambati Rayudu dives full length to his right to pluck a brilliant catch

IPL 2022 : స్టన్నింగ్ క్యాచ్..

ఇక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ గా రవీంద్ర జడేజా కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 217 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత వరకు బెంగళూరు జట్టే విజయం సాధించేలా కనిపించింది. అయితే 18వ ఓవర్ లో అద్భుత బంతితో దినేశ్ కార్తీక్ ను అవుట్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాయం అయింది. షాబాజ్ అహ్మద్ (27 బంతుల్లో 41; 4 ఫోర్లు) బెంగళూరు ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

https://twitter.com/Shaun81172592/status/1513945950141632512?s=20&t=i5n-wJ-6g7Ml8BvAgo27Rw

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది