IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!
ప్రధానాంశాలు:
IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ ఒక్క దాని కోసమే.. అదే ‘ఆరెంజ్ క్యాప్’. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక క్యాప్ ఒక 15 ఏళ్ల కుర్రాడి వద్ద ఉండటం విశేషం. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం పరుగుల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.వైభవ్ విధ్వంసం.. జైస్వాల్ ఫిదా! పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 43 పరుగులతోనే విరుచుకుపడి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. వైభవ్ బ్యాటింగ్ శైలికి ముగ్ధుడైన యశస్వి జైస్వాల్, స్వయంగా అతనికి ఆ క్యాప్‌ను తొడిగి ప్రశంసల్లో ముంచెత్తాడు. వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఒక మధురమైన అనుభూతి అని జైస్వాల్ పేర్కొన్నాడు.
IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!
వాంఖడే పోరు.. ఆరెంజ్ క్యాప్ చేతులు మారుతుందా? నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య 41వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ నుండి ఆరెంజ్ క్యాప్‌ను లాగేసుకోవాలని ముగ్గురు స్టార్ బ్యాటర్లు పోటీ పడుతున్నారు
అభిషేక్ శర్మ (SRH): పరుగుల మెషీన్‌లా మారుతున్న అభిషేక్ ఈ రేసులో ముందున్నాడు. ఇషాన్ కిషన్ (MI): తన హోమ్ గ్రౌండ్‌లో చెలరేగి ఆరెంజ్ క్యాప్ పట్టేయాలని ఇషాన్ చూస్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (SRH): ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్లాసెన్ కూడా ఈ పోటీలో గట్టిగా ఉన్నాడు. నేటి మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ వైభవ్ వద్దే ఉంటుందా? లేక హైదరాబాద్, ముంబై ఆటగాళ్లలో ఎవరికైనా దక్కుతుందా? అనేది చూడాలి!