IPL Auction 2022 : ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో సీనియర్ ప్లేయర్స్.. సిద్ధమైన ఫ్రాంచైజీలు..?
IPL Auction 2022 : క్రికెట్ ప్రియులు ఐపీఎల్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో అన్ని జట్ల రూపురేఖలు మారనున్నాయి. ఇకపోతే ఈ ఐపీఎల్ 15వ సీజన్‌లో రెండు కొత్త జట్లు ఆడబోతున్నాయి. ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది. కాగా, ఈ సారి వేలం చాలా ఆసక్తికరంగా ఉంటుందని పలువురు అంటున్నారు.15 వ సీజన్ ఆటగాళ్ల వేలం వచ్చే నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఇకపోతే ఈ సారి మెగా వేలంలో ఈ ఐదుగురు ఆటగాళ్లు ధనవంతుల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటారని కొందరు అంటున్నారు.
వాళ్లు ఎవరంటే.. ఆస్ట్రేలియా అద్భుత ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈయన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా తొలి సారి టీ ట్వంటీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈయనపై ఐపీఎల్ వేలంలో ఈ సారి కాసుల వర్షం కురిపించే అవకాశాలుండొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన జట్టు నుంచి శిఖర్ ధావన్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, ఈయనకున్న అనుభవం కారణంగా చాలా ఫ్రాంచైజీలు అతనిని తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నాయి.
IPL Auction 2022 : వేలం ఎప్పుడంటే..
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నిలబెట్టుకోలేదు. మెగా వేలంలో ఈయన తన అద్భుతమైన ప్రదర్శనకుగాను మంచి ఫలితం పొందే అవకాశాలున్నాయి. సురేశ్ రైనా ఐపీఎల్ రికార్డు కూడా అడ్భుతం కాగా, ఆయనకు వేలం సమయంలో అనుకూలతలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆటగాడు డ్వేన్ బ్రావోకు కూడా ఐపీఎల్ వేలంలో డబ్బుల వర్షం కురిపించవచ్చు. ఇందుకు ప్రధానమైన కారణం.. ఆయన ఐపీఎల్‌లో కనబర్చిన ప్రతిభనే. బ్రావో తన ఐపీఎల్ కెరీర్‌లో 1,537 పరుగులు చేశాడు. బ్రావో ఐపీఎల్‌లో 151 మ్యాచులు ఆడి 167 వికెట్లు తీశాడు.