IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్‌ల షేర్ల విలువ భారీ స్థాయిలో పెరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఐపీఎల్ న్యూ టీమ్స్‌కు వేలం పాట జరగనుంది. ఈ క్రమంలోనే నూతన జట్ల ధరలు భారీగా పెరగనున్నాయట. కనీసంగా జట్ల ధర రూ. 8 వేల కోట్ల వరకు చేరుతుందని అనుకుంటున్నారు. ఆ లెక్కన ఒక్కో షేర్ ధర రెండొందల రూపాయలకు చేరుతుందని అంచనా.ఐపీఎల్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అపూర్వ విజయం సాధించి సీటీమార్ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. ఐపీఎల్ 2021 టైటిల్ కైవసం చేసుకున్న నేపథ్యంలో చెన్నైసూపర్ కింగ్స్ టీంలో జోష్ వచ్చింది. ధోని సేన నాల్గో సారి టైటిల్ నెగ్గడం పట్ల క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంగతులు ఇలా ఉంచితే..
చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క షేర్ ధర తాజాగా రూ.135 పలికింది. ఆ ప్రకారంగా ఐపీఎల్ టీమ్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ ధర రూ.4,200 కోట్లుగా ఉంది. అయితే, చెన్నైసూపర్ కింగ్స్ టీమ్ ఒక్కటే కాదు .. మిగతా ఐపీఎల్ టీమ్‌ల షేర్ల విలువ కూడా భారీ స్థాయికి పెరగనుంది. మొత్తంగా కొత్త టీమ్‌ల వేలం పాట.. పాత టీమ్‌ల ఓనర్స్‌కు జోష్ ఇవ్వనుంది. ఐపీఎల్ నిర్వహణ తొలిసారిగా 2008లో జరగగా, అప్పట్లో జరిగిన వేలం పాటలో ఒక్కో టీమ్‌ను యాజమాన్యాలు దాదాపు రూ.400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాయి. ఇకపోతే అప్పట్లో అత్యల్ప ధర పలికిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ ఉంది. మిగతా టీమ్‌లన్నిటికీ 400 నుంచి 500 కోట్ల రూపాయల ధర పలికింది. ఐపీఎల్ ఫస్ట్ ఇయర్ బాగా సక్సెస్ అయింది.
కానీ, యాజమాన్యాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు రావడం గమనార్హం. ఒక్కో టీమ్ రూ.10 నుంచి 30 కోట్లు లాస్ అయినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అలా వార్తలు వచ్చినప్పటికీ ఐపీఎల్ టీమ్‌ల మార్కెట్ వాల్యూ క్రమంగా పెరుగుతూ రావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రజెంట్ షేర్ వాల్యూ చూస్తే కనుక అది దాని ఫ్రాంచైజీ సంస్థను దాటేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇండియా సిమెంట్స్ వాళ్లు అప్పట్లో చెన్నైసూపర్ కింగ్స్ టీమ్‌ను వేలం పాటలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.