Paris Olympics 2024 : ఒలంపిక్స్‌లో కొత్త వివాదం.. బ‌యోలాజిక‌ల్ మేల్‌తో ఫీమేల్ పోటీ…46 సెకన్లలో ముగిసిన మ్యాచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Paris Olympics 2024 : ఒలంపిక్స్‌లో కొత్త వివాదం.. బ‌యోలాజిక‌ల్ మేల్‌తో ఫీమేల్ పోటీ…46 సెకన్లలో ముగిసిన మ్యాచ్

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,3:00 pm

Paris Olympics 2024  : పారిస్ ఒలింపిక్స్ 2024లో కొత్త వివాదం చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఇటలీ బాక్సర్‌కు తీరని అన్యాయం జరిగింది. లింగ నిర్దారణ పరీక్షలో విఫలమైన అల్జీరియాకు చెందిన బాక్సర్‌ ఇమేన్ ఖెలిఫ్‌కు ఒలింపిక్స్ నిర్వాహకులు అనుమతిచ్చారు. దాంతో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారి తీవ్రంగా గాయపడింది. 46 సెకన్లలోనే మ్యాచ్‌ను ముగించిన అల్జీరియా.. ఏంజెలా కారిని బౌట్ నుంచి నిష్క్రమించేలా బెంబేలెత్తించింది. దాంతో ఒలింపిక్స్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఓ అథ్లెట్ హిజాబ్ ధరించడంతో.. ఓపెనింగ్ సెర్మనీ నుంచి నిషేధం విధించిన ఉదంతం పెను వివాదానికి కారణమైంది.

Paris Olympics 2024 : భారీ మోసం..

ఇప్పుడు మహిళా బాక్సర్‌పై మగ బాక్సర్‌ను బరిలోకి దింపారని ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి 66 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినీ అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్‌తో తలపడింది. కానీ, మ్యాచ్ ప్రారంభమైన కేవలం 46 సెకన్లలో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారినీ పోటీ నుంచి వైదొలిగింది. పురుషుడిలా శారీరక లక్షణాలున్న ఇమాన్ ఖలీఫా మహిళా కంటెస్టెంట్‌తో పోటీకి దిగడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి పారిస్ ఒలింపిక్స్‌లో చాలా మంది ట్రాన్స్‌జెండర్ పురుష అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు. ఈ విధంగా వారి లింగాన్ని మార్చుకున్న పోటీదారులు మహిళల విభాగంలో పోటీ చేయడానికి అనుమతిస్తారు. నిర్వాహకుల ఈ నిర్ణయం ఇప్పుడు వివాదానికి కారణమైంది.

లింగమార్పిడి చేసిన పురుషులకు వ్యతిరేకంగా మహిళా పోటీదారులు పోటీపడటం మహిళా అథ్లెట్ల అసంతృప్తికి దారితీసింది. ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల కారిని ఖలీఫా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అతడి ముక్కుకు గాయం కావడంతో పాటు ధరించిన మాస్క్ కూడా తెగిపోయింది. దీంతో కారిని వెంటనే తన కోచ్‌తో మాట్లాడి పోటీ నుంచి తప్పుకున్నాడు. అలా 46 సెకన్లు మాత్రమే సాగిన మ్యాచ్‌లో ఖలీఫా విజేతగా నిలిచాడు. బాక్సింగ్ రింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన ఏంజెలా కారినీ కంటతడి పెట్టుకుంది. ఇది చాలా విచారంగా ఉందంటూ తెలిపాడు. “నా జీవితంలో ఇంత బలమైన దెబ్బ ఎప్పుడూ అనుభవించలేదు” అని అతను చెప్పారు.ఖెలిఫ్ మహిళ కాదని, మగ లక్షణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల మధ్యే ఆమె ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. అయితే ఖెలిఫ్‌తో పాటు ఒలింపిక్స్ నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది