Kavya Maran : కావ్యకి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్
Kavya Maran : ఐపీఎల్ సీజన్ 2024కి తెరపడింది. ఈ సీజన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారు అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ముచ్చటగా మూడోసారి కప్ కొట్టింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే చేజ్ చేసింది కేకేఆర్ జట్టు. సన్‌రైజన్స్ హైదరాబాద్ జట్టులో సారథి పాట్ కమిన్స్ (19 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఛేదనలో వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పిడుగులా విరుచుకుపడ్డాడు.
ఫైనల్లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వెనక్కి తిరిగి కన్నీరు తుడుచుకుంటూ బాధలో కూడా ఫైనల్ వరకు వచ్చిన తన టీమ్ హైదరాబాద్‍ను, విజేతగా నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్‌ను చప్పట్లతో అభినందించారు కావ్య. కావ్య మారన్ బాధగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. సీజన్ మొత్తం జట్టుతోనే ఉంటూ ప్రోత్సహిస్తూ వచ్చిన కావ్య ఇలా కన్నీరు పెట్టుకోవడం అభిమానులని ఎంతగానో బాధించింది. కావ్య కోసం అయిన ఈ సారి గెలిచి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Kavya Maran : కావ్యకి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్
ఇక కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌ని షారూఖ్ ముద్దుపెట్టుకున్నాడు. ఫైనల్ గెలిచాక కోల్‍కతా కో-ఓనర్, షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్ దగ్గరకు వచ్చి నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఆటగాళ్లు భుజాన మోసి స్టేడియంలో తిప్పారు. సంబరాలు చేసుకున్నారు. ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా చెపాక్ మైదానంలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్‍కతా ప్లేయర్లను కౌగిలించుకుంటూ అభినందించారు. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‍గా కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిళ్లను గంభీర్ అందించిన విషయం తెలిసిందే.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.