Kavya Maran : కావ్య‌కి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kavya Maran : కావ్య‌కి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్

 Authored By aruna | The Telugu News | Updated on :27 May 2024,5:39 pm

Kavya Maran : ఐపీఎల్ సీజ‌న్ 2024కి తెర‌ప‌డింది. ఈ సీజ‌న్‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్‌.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ముచ్చ‌ట‌గా మూడోసారి క‌ప్ కొట్టింది. స్టార్క్‌ (2/14), రస్సెల్‌ (3/19), హర్షిత్‌ (2/24) దెబ్బకు హైదరాబాద్‌ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే చేజ్ చేసింది కేకేఆర్ జ‌ట్టు. స‌న్‌రైజ‌న్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో సారథి పాట్‌ కమిన్స్‌ (19 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో వెంకటేశ్‌ అయ్యర్‌ (26 బంతుల్లో 52 నాటౌట్‌, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పిడుగులా విరుచుకుపడ్డాడు.

Kavya Maran ఫైన‌ల్‌లో ఫుల్ ఎమోష‌న్స్

ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వెనక్కి తిరిగి కన్నీరు తుడుచుకుంటూ బాధ‌లో కూడా ఫైనల్ వరకు వచ్చిన తన టీమ్ హైదరాబాద్‍ను, విజేతగా నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్‌ను చప్పట్లతో అభినందించారు కావ్య. కావ్య మారన్ బాధగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. సీజన్ మొత్తం జట్టుతోనే ఉంటూ ప్రోత్సహిస్తూ వ‌చ్చిన కావ్య ఇలా క‌న్నీరు పెట్టుకోవ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో బాధించింది. కావ్య కోసం అయిన ఈ సారి గెలిచి ఉంటే బాగుండేద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Kavya Maran కావ్య‌కి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్

Kavya Maran : కావ్య‌కి కన్నీరు పెట్టించి గంభీర్‌కి ముద్దు ఇచ్చిన షారూఖ్ ఖాన్

ఇక కేకేఆర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన గంభీర్‌ని షారూఖ్ ముద్దుపెట్టుకున్నాడు. ఫైనల్ గెలిచాక కోల్‍కతా కో-ఓనర్, షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఆటగాళ్లు భుజాన మోసి స్టేడియంలో తిప్పారు. సంబరాలు చేసుకున్నారు. ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా చెపాక్ మైదానంలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్‍కతా ప్లేయర్లను కౌగిలించుకుంటూ అభినందించారు. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‍గా కోల్‍‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిళ్లను గంభీర్ అందించిన విష‌యం తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది