Anjali : అంజలికి ఐదు సార్లు పెళ్లయిందా.. తన వివాహంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ
Anjali : దక్షిణాది సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్లలో అంజలి ఒకరు. తెలుగమ్మాయి అయిన అంజలి తన నటన, అందంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇటీవ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ఆడియెన్స్ ఆకట్టుకొన్న ఈ భామ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో మరోసారి ప్రేక్షక దేవుళ్లను ప్రసన్నం చేసుకొనేందుకు వస్తుంది. అయితే ఈ క్రమంలో ఆమె పెళ్లిళ్లపై వస్తున్న ప్రచారాలకి క్లారిటీ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా అంజలి పెళ్లికి సంబంధించి నెట్టింట అనేక వార్తలు చక్కర్లుకొట్టాయి. పెళ్లి కూడా చేసుకుందనే వార్తలొచ్చాయి.
ఆ మధ్య దీనిపై స్పందిస్తూ అంజలి కొట్టిపారేసింది. తాజాగా మరోసారి వివరణ ఇచ్చింది. తన మ్యారేజ్ రూమర్లు వస్తూనే ఉన్నాయని, ఇప్పటికే నాలుగైదు సార్లు మ్యారేజ్ చేశారని తెలిపారు. అయితే మొన్న వచ్చిన రూమర్లతో తమ బంధువులు కూడా ఫోన్ చేసి ఆరా తీసారని, అంతగా రూమర్లు ప్రభావితం చేస్తున్నాయని తెలిపింది అంజలి. అలాగని తాను పెళ్లికి దూరం కాదు అని, కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదని తెలిపింది అంజలి. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, మ్యారేజ్ చేసుకుంటే రెండింటిని మ్యానేజ్ చేయలేనని తెలిపింది.
Anjali : అంజలికి ఐదు సార్లు పెళ్లయిందా.. తన వివాహంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ
ఇటు సినిమాని, అటు వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంజలి. ప్రస్తుతం ఇదిగో ఇతన్ని చేసుకుంటానని ఇంట్లో చెప్పేంత టైమ్ కూడా ఉండటం లేదని, ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటున్నట్టు చెప్పింది అంజలి. గేమ్ ఛేంజర్‌లో కూడా నాది బలమైన పాత్ర. కీలకమైంది.. గెస్ట్ అప్పీయెరెన్స్ రోల్ కాదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటే.. అందులో నాది కూడా ముఖ్యమైన పాత్రే. కథకు బలంగా ఉండే క్యారెక్టర్ నాది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ తర్వాత నా పాత్ర ఏమిటో మీకే అర్ధం అవుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అంటూ ఆమె ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.