Home » Exclusive » Kkr Vs Pbks Match Records In Ipl 2024
Exclusive

KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 27, 2024, 11:00 am
Advertisement

KKR vs PBKS : ఐపీఎల్ 2024లో స‌రికొత్త రికార్డ్స్ న‌మోద‌వుతున్నాయి. తాజాగా 42వ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. అది కూడా 262 పరుగులను ఛేదించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. . పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్ స్టో సెంచ‌రీతో చెల‌రేగ‌గా…శ‌శాంక్‌సింగ్‌, ప్ర‌భ్‌సిమ్రాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొట్టి పంజాబ్‌కు అద్భుత విజ‌యాన్ని అందించారు.. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇది కాగా, 2022 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పైనే రాజ‌స్థాన్ 224 ప‌రుగుల్ని ఛేదించి రికార్డ్ నెల‌కొల్పింది. ఇప్పుడు రాజ‌స్థాన్ రికార్డ్‌ను కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌తో పంజాబ్ బ‌ద్ద‌లు కొట్ట‌డం విశేషం. అయితే టీ20 క్రికెట్‌లో 2023లో వెస్టిండీస్‌పై 259 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి సౌతాఫ్రికా రికార్డ్ నెల‌కొల్పితే ఇప్పుడు ఆ రికార్డ్‌ని పంజాబ్ తుడిచి పెట్టింది.

Advertisement

KKR vs PBKS : సంచ‌ల‌న విజ‌యం

టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు క‌లిపి 42 సిక్స్‌లు కొట్టడం విశేషం. గ‌తంలో ఈ రికార్డ్ ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ పేరిట ఉండ‌గా, అవి చెరిగిపోయింది. ఇక ఇదే సీజ‌న్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 38 సిక్స్‌లు కొట్టాయి. ఆ రికార్డ్ పంజాబ్, కోల్‌క‌తా టీమ్‌లు అధిగ‌మించాయి.ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) , వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించ‌డంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది.

KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..!

Advertisement

లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో విజయం సులువుగా వచ్చింది. కేవ‌లం రెండు వికెట్స్ మాత్ర‌మే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు ఉండ‌గానే విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి