KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..!

KKR vs PBKS : ఐపీఎల్ 2024లో స‌రికొత్త రికార్డ్స్ న‌మోద‌వుతున్నాయి. తాజాగా 42వ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. అది కూడా 262 పరుగులను ఛేదించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. . పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్ స్టో సెంచ‌రీతో చెల‌రేగ‌గా…శ‌శాంక్‌సింగ్‌, ప్ర‌భ్‌సిమ్రాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొట్టి పంజాబ్‌కు అద్భుత విజ‌యాన్ని అందించారు.. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇది కాగా, 2022 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పైనే […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..!

KKR vs PBKS : ఐపీఎల్ 2024లో స‌రికొత్త రికార్డ్స్ న‌మోద‌వుతున్నాయి. తాజాగా 42వ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. అది కూడా 262 పరుగులను ఛేదించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. . పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్ స్టో సెంచ‌రీతో చెల‌రేగ‌గా…శ‌శాంక్‌సింగ్‌, ప్ర‌భ్‌సిమ్రాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొట్టి పంజాబ్‌కు అద్భుత విజ‌యాన్ని అందించారు.. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇది కాగా, 2022 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పైనే రాజ‌స్థాన్ 224 ప‌రుగుల్ని ఛేదించి రికార్డ్ నెల‌కొల్పింది. ఇప్పుడు రాజ‌స్థాన్ రికార్డ్‌ను కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌తో పంజాబ్ బ‌ద్ద‌లు కొట్ట‌డం విశేషం. అయితే టీ20 క్రికెట్‌లో 2023లో వెస్టిండీస్‌పై 259 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి సౌతాఫ్రికా రికార్డ్ నెల‌కొల్పితే ఇప్పుడు ఆ రికార్డ్‌ని పంజాబ్ తుడిచి పెట్టింది.

KKR vs PBKS : సంచ‌ల‌న విజ‌యం

టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు క‌లిపి 42 సిక్స్‌లు కొట్టడం విశేషం. గ‌తంలో ఈ రికార్డ్ ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ పేరిట ఉండ‌గా, అవి చెరిగిపోయింది. ఇక ఇదే సీజ‌న్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 38 సిక్స్‌లు కొట్టాయి. ఆ రికార్డ్ పంజాబ్, కోల్‌క‌తా టీమ్‌లు అధిగ‌మించాయి.ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) , వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించ‌డంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది.

KKR vs PBKS రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే

KKR vs PBKS : రికార్డ్ చేజింగ్ చేసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో ఎన్ని రికార్డ్స్ న‌మోద‌య్యాయంటే..!

లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో విజయం సులువుగా వచ్చింది. కేవ‌లం రెండు వికెట్స్ మాత్ర‌మే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు ఉండ‌గానే విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది