Hardik Pandya : ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఆడేసుకున్న రోహిత్ అభిమానులు… కుక్కను చూపిస్తూ…!
ప్రధానాంశాలు:
Hardik Pandya : ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఆడేసుకున్న రోహిత్ అభిమానులు... కుక్కను చూపిస్తూ...!
Hardik Pandya : మన భారతదేశంలో ఐపీఎల్ IPL 2024 కు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2024లో రావాల్సిన IPL సీజన్ రానే వచ్చింది. అయితే ఈసారి కెప్టెన్సీ మార్పు అనే అంశంతో ఐపీఎల్ ( IPL ) లో ముంబై ఇండియన్స్ టీమ్ ఎలా ఆడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో హోరాహోరీ పోటీ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ ఆడిన ఈ ఫస్ట్ మ్యాచ్ లో వారి ఆట తీరుకంటే కూడా ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని చెప్పాలి. దీంతో అదే సమయంలో స్టేడియంలో అభిమానులంతా పాండ్యాను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
అయితే ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించడంతోపాటు రోహిత్ శర్మతో Rohit Sharma పాండ్య వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహం తీసుకువచ్చింది. దీంతో కొత్త కెప్టెన్ పాండ్యా చిన్న విషయంలో దొరికిన వదిలే సమస్య లేదన్నట్టు డిసైడ్ అయ్యారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన గుజరాత్ టైటమ్స్ మ్యాచ్ లో టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగితే వరకు హార్దిక్ పాండ్యాను అందరూ ర్యాగింగ్ చేస్తూనే వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ముంబై మరియు మరియు టీజీ మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చిన అహ్మదాబాద్ లో టాస్ టైంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనగానే ఫ్యాన్స్ అందరూ రోహిత్ రోహిత్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే మ్యాచ్ మొదలైన తర్వాత మధ్యలోకి ఒక కుక్క రావడం జరిగింది. దీంతో మ్యాచ్ కు కాసేపు ఆటంకం కలిగిందని చెప్పాలి. అయితే కుక్క గ్రౌండ్ లో పరిగెడుతుంటే స్టేడియం లో ఉన్న అభిమానులు అందరూ హార్దిక్ అంటూ అరవడం మొదలుపెట్టారు. కుక్కని చూస్తూ హార్దిక్ హార్దిక్ అని అరుస్తూ ట్రోల్ చేశారు.

Rohit Sharma : రోహిత్‌ని దారుణంగా అవమానించిన హార్ధిక్.. ఓటమి అనంతరం హిట్‌మ్యాన్ సీరియస్..!
అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 36 సర్కిల్ లో ఫీలింగ్ చేసే రోహిత్ శర్మ ను కావాలని బౌండరీ లైన్ దగ్గరకు పంపించాడు. టీమ్ లో తనకంటూ తోపు ఎవరూ లేరనే విధంగా బిహేవ్ చేశాడు. దీంతో ఆవేశం తట్టుకోలేని రోహిత్ శర్మ ఫ్యాన్స్ పాండ్యాను ఎగతాళి చేశారు. ఇలా మ్యాచ్ మొత్తం హార్దిక్ పాండ్యాను ఇబ్బంది పెడుతూనే వచ్చారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు దిగిన సమయంలో కూడా ఇదే జరిగింది. దీంతో ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి హార్థిక్ పాండ్య పై రోహిత్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
When this dog enter into the ground people literally booed HARDIK HARDIK ???????? #chapri #HardikPandya pic.twitter.com/BKJuNrSOC2
— Villager Anuj Tomar (@Da___Engineer) March 25, 2024