Mohammed Siraj : యంగ్ హీరోయిన్‌తో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడా.. ఇది అసలు క్లారిటీ..!
ప్రధానాంశాలు:
Mohammed Siraj : యంగ్ హీరోయిన్‌తో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడా.. ఇది అసలు క్లారిటీ..!
Mohammed Siraj : హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ హిందీ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు దారుణంగా వస్తున్నాయి.బాలీవుడ్ లోని యంగ్ బ్యూటీతో ఈ క్రికెటర్ కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో వీరు తరుచూగా కలుస్తున్నారంటూ కూడా రూమర్లు తెగ వ్యాప్తి చెందాయి.

Mohammed Siraj : యంగ్ హీరోయిన్‌తో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడా.. ఇది అసలు క్లారిటీ..!
Mohammed Siraj క్లారిటీ ఇచ్చేశాడు..
ఇన్‌స్టాగ్రామ్‌లో మహీరా శర్మ పోస్ట్ చేసిన ఒక ఫోటోను 2023లో మహ్మద్ సిరాజ్ లైక్ చేశారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఒకానొక సమయంలో మహీరా తల్లి ఆ వార్తలను ఖండించారు కూడా! అయినా ఆ ప్రచారం ఆగలేదు. అయితే ఇప్పుడు మహ్మద్ సిరాజ్ ఆ వార్తలను ఖండించారు.
తన సోషల్ మీడియాలో సిరాజ్ స్పందిస్తూ..ప్రతి ఒక్కరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా పాపారాజిలకు స్పెషల్ రిక్వెస్ట్. నన్ను ఇంకెలాంటి ప్రశ్నలు అడగకండి. అది అంతా పూర్తి అవాస్తవం. ఎలాంటి ఆధారంలేని. ఇంతటితో ఇది ఆగిపోతుందని ఆశిస్తున్నాను… అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 13లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మహీరా శర్మ పాపులర్ అయ్యింది. ఆ షో తర్వాత ఆమె సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అంతకు ముందు ఆవిడ కొన్ని టీవీ సీరియల్స్ చేసింది.