Mohammed Siraj : ఆర్సీబీపై అందుకే కక్ష తీర్చుకున్నానంటూ సిరాజ్ కామెంట్స్
ప్రధానాంశాలు:
Mohammed Siraj : ఆర్సీబీపై అందుకే కక్ష తీర్చుకున్నానంటూ సిరాజ్ కామెంట్స్
Mohammed Siraj : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని మెరుగైన స్కోరు సాధించిన ఆర్సీబీ.. బౌలర్ల పేలవ ప్రదర్శనతో పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ వారిని బాగా దెబ్బ తీసాడు. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడి, ఈ సీజన్‌లో గుజరాత్ జట్టుకు వెళ్లిపోయిన సిరాజ్, తన అద్భుత బౌలింగ్‌తో బెంగళూరు జట్టును గట్టి దెబ్బ తీశాడు. ఇక బట్లర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. టైటాన్స్‌ను విజయాన్ని అందించాడు.

Mohammed Siraj : ఆర్సీబీపై అందుకే కక్ష తీర్చుకున్నానంటూ సిరాజ్ కామెంట్స్
Mohammed Siraj అందుకే అలా..
అయితే ఈ మ్యాచులో 4 ఓవర్లు వేసి 19 పరుగులే సమర్పించుకుని 3 వికెట్లు తీశాడు సిరాజ్. పదునైన బౌలింగ్‌తో ఆర్సీబీ జట్టును గట్టిగా అడ్డుకున్నాడు. మూడో ఓవర్లో పడిక్కల్ (4)ను బౌల్డ్ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో హార్డ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ (14)ను పెవిలియన్ చేర్చాడు. 19వ ఓవర్లో లివింగ్‌స్టన్ (24)ను ఔట్ చేశాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడాడు సిరాజ్. “నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడ ఏడేళ్లు నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్ కు మారడం కాస్త ఎమోషనల్ గా అనిపించింది.
ఒక్కసారి బంతికి చేతికి వచ్చిందంటే విజృంభిస్తాను. నేను రొనాల్డో అభిమానిని, అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను నిలకడగానే ఆడుతున్నాను. విరామం సమయంలో నా తప్పులను సరిదిద్దుకున్నాను, నా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాను. గుజరాత్ టైటాన్స్ నన్ను తీసుకున్న తర్వాత ఆశిష్ భాయ్ తో మాట్లాడాను. అతడు నన్ను స్వేచ్ఛగా బౌలింగ్ ను చేయమన్నాడు. ఇషాంత్ భాయ్ కూడా అదే చెప్పాడు. పిచ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు, మైండ్ సెట్‌తోనే ఆడతాను అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.