
ms dhoni is practising helicopter shots in nets
MS Dhoni : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)-2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి సెప్టెంబరు 19న దుబాయ్ వేదికగా పునః ప్రారంభమైంది. అయితే, ఐపీఎల్ ఫైనల్ తుది అంకానికి చేరకుంది. అక్టోబర్-15 శుక్రవారం (నేడు) జరగనుంది. తొమ్మిదవ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఈ సీజన్‌లో మొదట పేలమైన ఆటతీరును కనబరిచి, చివరగా ఫైనల్‌కు చేరిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ (kkr) జట్టుతో తలపడనుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో జరిగే ఈ ఇంట్రెస్టింగ్ చివరి పోరు కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సీఎస్కే ఫ్యాన్స్ తలా ఈజ్ బ్యాక్ అంటూ ధోనిని పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. అందుకు కారణం తొలి క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో ధోని తనదైన శైలిలో ఫినిషింగ్ గేమ్ ఆడి ఢిల్లీని చిత్తుగా ఓడించడమే.
MS Dhoni Is Practising Helicopter Shots In Nets
ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ధోని సేన టైటిల్ సాధించాలన్న కసితో ఉన్నట్టు తెలిసింది. అందుకోసమే మాజీ చాంపియన్లు ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఈ క్రమంలో చెన్నై జట్టు కుర్రాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్త కొద్ది గంటల్లోనే తెగ వైరలైంది. సీఎస్కే అభిమానులనే కాకుండా ముఖ్యంగా ధోని ఫ్యాన్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది.
MS Dhoni Is Practising Helicopter Shots In Nets
ఇందులో మిస్టర్ కూల్, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఐకాన్ షాట్స్.. ‘హెలికాప్టర్ షాట్స్’ను ప్రాక్టీసు చేయడాన్ని మనం చూడవచ్చు. మరో కీలక ప్లేయర్ సురేశ్ రైనా సైతం ఈ వీడియోలో కనిపించడంతో ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఆడుతాడా లేదా అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఒకవేళ రైనా ఆడకపోతే మళ్లీ రాబిన్ ఊతప్ప వైపే ధోని మొగ్గు చూపుతాడేమో అని నెటిజన్లు చర్చిస్తున్నారు. ఏదేమైనా ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచిచూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.