Categories: ExclusiveNewssports

MS Dhoni : ధోని ఎంట్రీతో మారిన లెక్క‌లు.. స‌న్‌రైజ‌ర్స్‌కి గ‌ట్టి షాకే ఇచ్చారుగా

MS Dhoni : ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కి ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజాని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ జడేజాను కెప్టెన్‌గా నియమించింది. జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా తీసుకున్నాడు. ధోని పేరును నిలబెడతానని.. అతని నాయకత్వంలో నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన సీఎస్‌కేను ఇకపై విజయవంతంగా నడిపిస్తానని.. నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని జడేజా గొప్పలకు పోయాడు. కాని అనుకున్న‌ది ఒక్క‌టి, అయింది ఒక్క‌టి అన్న చందాన జ‌డేజా ప‌రిస్థితి మారింది.

ఒక‌వైపు టీంని గెలిపించ‌లేక మ‌రోవైపు త‌న ప‌ర్‌ఫార్మెన్స్ మెరుగ‌ప‌ర‌చుకోలేక నానా ఇబ్బందులు ప‌డ్డాడు.ఇప్పటివరకు సీఎస్‌కే ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన జడేజా ఆల్‌రౌండర్‌గాను నిరాశపరిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏది చూసుకున్నా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. ఈ క్ర‌మంలో సీఎస్‌కే జ‌ట్టు పగ్గాల‌ని మ‌ళ్లీ ధోనికి అప్ప‌గించింది. ధోని కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్‌ కింగ్స్‌ అయ్యింది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది

Ms dhoni team wins in the latest match

MS Dhoni : ధోని ఈజ్ బ్యాక్..

.మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్‌లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (33 బంతుల్లో 64 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అందివచ్చిన లైఫ్‌లతో అర్ధసెంచరీ చేశాడు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ముకేశ్‌ చౌదరి తన ఆఖరి, ఇన్నింగ్స్‌ 20వ ఓవర్లో 6, 4, 0, వైడ్, 6, 6, 1లతో ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవడంతో ధోని అసహనం వ్యక్తం చేయగా, గెలుపు అంతరం తగ్గింది.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

54 minutes ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

1 hour ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

3 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

4 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

6 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

6 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

7 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

8 hours ago