MS Dhoni : ధోని ఎంట్రీతో మారిన లెక్కలు.. సన్‌రైజర్స్‌కి గట్టి షాకే ఇచ్చారుగా
MS Dhoni : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కి ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజాని నియమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ జడేజాను కెప్టెన్‌గా నియమించింది. జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా తీసుకున్నాడు. ధోని పేరును నిలబెడతానని.. అతని నాయకత్వంలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సీఎస్‌కేను ఇకపై విజయవంతంగా నడిపిస్తానని.. నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని జడేజా గొప్పలకు పోయాడు. కాని అనుకున్నది ఒక్కటి, అయింది ఒక్కటి అన్న చందాన జడేజా పరిస్థితి మారింది.
ఒకవైపు టీంని గెలిపించలేక మరోవైపు తన పర్‌ఫార్మెన్స్ మెరుగపరచుకోలేక నానా ఇబ్బందులు పడ్డాడు.ఇప్పటివరకు సీఎస్‌కే ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన జడేజా ఆల్‌రౌండర్‌గాను నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏది చూసుకున్నా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. ఈ క్రమంలో సీఎస్‌కే జట్టు పగ్గాలని మళ్లీ ధోనికి అప్పగించింది. ధోని కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్ కింగ్స్ అయ్యింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది

Ms dhoni team wins in the latest match
MS Dhoni : ధోని ఈజ్ బ్యాక్..
.మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్‌లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అందివచ్చిన లైఫ్‌లతో అర్ధసెంచరీ చేశాడు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేశ్ చౌదరి తన ఆఖరి, ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 6, 4, 0, వైడ్, 6, 6, 1లతో ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవడంతో ధోని అసహనం వ్యక్తం చేయగా, గెలుపు అంతరం తగ్గింది.