
Sunrisers Hyderabad : ఇలా అయితే కష్టం.. మరోసారి సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శన..!
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2025లో IPL 2025 భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో Sunrisers Hyderabad సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ mumbai indians విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచుల్లో ముంబయి జట్టుకు ఇది మూడో విజయం. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. దీంతో ఐదవ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలపై తీవ్ర దెబ్బ పడింది.
Sunrisers Hyderabad : ఇలా అయితే కష్టం.. మరోసారి సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శన..!
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి బ్యాటర్లందరూ మంచి ప్రదర్శనే చేశారు. రియాన్ రికల్టన్ (23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 31 పరుగులు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 26 రన్స్), విల్ జాక్స్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 36 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 26 రన్స్) రాణించారు.
అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2 పరుగులు) మళ్లీ నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు) బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఫీల్డింగ్ లో బానే రాణించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 37 రన్స్) కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు .
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.