Rohit Sharma : ఆ క్రికెట్ ప్లేయర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం రోహిత్ శర్మేనా?
Rohit Sharma : క్రికెట్ లో రాణించాలంటే క్రికెట్ బాగా ఆడితే సరిపోదు. అక్కడ ఉండే రాజకీయాలను తట్టుకోవాలి. కొన్నిసార్లు ఇతర ప్లేయర్ల నుంచి కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. బాగా ఆడేవాళ్లందరూ ఇండియా తరుపున ఆడరు. అందరినీ ఆడించరు కూడా. ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయి. ఒక ప్లేయర్ కెప్టెన్ అయ్యాడు అంటే.. వెనుక చాలామంది ప్లేయర్ల త్యాగం కూడా ఉంటుంది.ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ల కోసం రోహిత్ శర్మను బీసీసీఐ కెప్టెన్ ను చేసింది. టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ.. జట్టును కనీసం సెమీస్ కు కూడా తీసుకెళ్లలేకపోయాడు.
దీంతో న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ లకు రోహిత్ శర్మను కెప్టెన్ ను చేసి.. కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో.. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా హ్యాట్రిక్ కొట్టింది. సిరీస్ ను కైవసం చేసుకుంది.అయితే.. కెప్టెన్ స్థాయికి ఎదగేందుకు రోహిత్ శర్మ ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. కాకపోతే.. కొందరు ప్లేయర్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టి.. తను కెప్టెన్ స్థాయికి ఎదిగాడు అనే ఆరోపణలు కూడా లేకపోలేవు.
Rohit Sharma : రోహిత్ శర్మ.. వల్ల తన కెరీర్ ను కోల్పోయిన ప్లేయర్ ఎవరు?
అప్పట్లో ధోని వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా సెటిల్ అయ్యాడు. దీంతో ఓపెనర్ కోసం చాలామంది పోటీ పడ్డారు. కానీ.. ఎవ్వరికీ రాని అవకాశం.. రోహిత్ శర్మకు వచ్చింది. ఓపెనర్ గా దిగి చెలరేగిపోయి ఆడటంతో రోహిత్ శర్మకు ఆ బెర్త్ ఖాయం అయిపోయింది. అప్పటి వరకు ఓపెనర్ గా ఉన్న మురళీ విజయ్ కెరీర్ ముగిసిపోయింది.నిజానికి.. గౌతమ్ గంభీర్ స్థానంలో మురళీ విజయ్ ని పిలిచారు. టీమిండియాలో గంభీర్ స్థానంలో మురళికి అవకాశం ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చాడు మురళీ. ఆ తర్వాత ఓపెనర్ గా సెటిల్ అయ్యాడు. భారత్ తరుపున 61 టెస్టులు ఆడాడు. 17 వన్డే మ్యాచ్ లు ఆడాడు.
అయితే.. 2019 లో టెస్ట్ ఓపెనర్ గా రోహిత్ శర్మ.. ఎంట్రీ ఇవ్వడంతో మురళీ విజయ్ టీమిండియాకు దూరం కావాల్సి వచ్చింది. ఓపెనర్ గా రావడమే సెంచరీలు చేసి రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో చేసేది లేక.. మురళి విజయ్ ని తప్పించాల్సి వచ్చింది.మొన్నటి వరకు చెన్నై తరుపున ఐపీఎల్ లో ఆడినా.. ఈ సంవత్సరం ఐపీఎల్ కోసం మురళీ విజయ్ ని ఏ ప్రాంచైజ్ తీసుకోలేదు. అటు అంతర్జాతీయ మ్యాచ్ లలో కెరీర్ ముగిసిపోవడం.. ఇటు ఐపీఎల్ లో ముగిసిపోవడం.. మరోవైపు దేశవాళీ క్రికెట్ లీగ్ లోనూ మురళీ విజయ్ పాల్గొనకపోవడంతో.. ఆయన క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.