Rohit Sharma : మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రెండు జట్లు చెరొకటి గెలిచాయి. ఒక టెస్ట్ డ్రా అయింది. ఇప్పుడు మెల్ బోర్న్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో ఎలా అయిన గెలిచి తీరాలని రెండు జట్ల ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన బంతి రోహిత్ ఎడమ మోకాలిని తగిలింది. దీంతో నొప్పితో శర్మ విలవిలలాడాడు. వెంటనే అతడికి వైద్య సాయం అందించారు. అయితే.. హిట్‌మ్యాన్ అయిన గాయం తీవ్రమైనది అని, అతడు బాక్సింగ్ డే టెస్టు ఆడడం అనుమానమేనని వార్తలు వచ్చాయి.
ఈ విషయం టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ కూడా స్పందించాడు.. క్రికెట్ ఆడేటప్పుడు దెబ్బలు తగలడం సహజం అని రోహిత్ శర్మ గాయాన్ని అతడు ధ్రువీకరించాడు. అయితే.. అదేమీ పెద్ద గాయం కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఆందోళన చెందాల్సిన పని లేదని, అతడు మెల్‌బోర్న్ టెస్టులో బరిలోకి దిగుతాడని అన్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ కూడా స్పందించాడు. మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన మోకాలి గాయం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బాక్సింగ్ డే టెస్టులో ఆడుతున్నానని చెప్పాడు. గాయంతో ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టత ఇచ్చాడు. అయితే, తాను బ్యాటింగ్ చేయబోయే స్థానంపై రోహిత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
జట్టుకు ఏది మంచిదైతే అది చేస్తానని వ్యాఖ్యానించాడు. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనే దాని గురించి చింతించవద్దని ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఇక విరాట్ కోహ్లీ ఫామ్, బ్యాటింగ్‌లో ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న ‘ఆఫ్ స్టంప్’ లోపాలపై మీడియా ప్రశ్నించగా… విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడని, లోపాలను అధిగమించే మార్గాన్ని కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కోహ్లీకి ఆఫ్ స్టంప్ లోపమా… ఆధునిక దిగ్గజ క్రికెటర్ అని మీరే చెబుతుంటారు. ఆధునిక దిగ్గజాలు సొంతంగా గాడిలో పడతారు’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను స్వేచ్ఛగా ఆడనిస్తామని, ప్రోత్సాహం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘జైస్వాల్ మైండ్‌సెట్‌ను మార్చకూడదు. అతడు తన బ్యాటింగ్‌ను మా అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. స్వేచ్ఛగా ఆడమంటూ ప్రోత్సహిస్తాం’’ అని కెప్టెన్ చెప్పాడు.
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా…
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
This website uses cookies.