Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు : రోహిత్ శ‌ర్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు : రోహిత్ శ‌ర్మ

 Authored By ramu | The Telugu News | Updated on :24 December 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు: రోహిత్ శ‌ర్మ

Rohit Sharma : మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భార‌త ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రెండు జ‌ట్లు చెరొక‌టి గెలిచాయి. ఒక టెస్ట్ డ్రా అయింది. ఇప్పుడు మెల్ బోర్న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టెస్ట్ మ్యాచ్‌లో ఎలా అయిన గెలిచి తీరాల‌ని రెండు జ‌ట్ల ఆట‌గాళ్లు భావిస్తున్నారు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన బంతి రోహిత్ ఎడ‌మ మోకాలిని త‌గిలింది. దీంతో నొప్పితో శ‌ర్మ విల‌విల‌లాడాడు. వెంట‌నే అత‌డికి వైద్య సాయం అందించారు. అయితే.. హిట్‌మ్యాన్ అయిన గాయం తీవ్ర‌మైన‌ది అని, అత‌డు బాక్సింగ్ డే టెస్టు ఆడ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Rohit Sharma నా మోకాలు బాగానే ఉంది ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు రోహిత్ శ‌ర్మ

Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు: రోహిత్ శ‌ర్మ

Rohit Sharma రోహిత్ క్లారిటీ..

ఈ విష‌యం టీమ్ఇండియా పేస‌ర్ ఆకాశ్ దీప్ కూడా స్పందించాడు.. క్రికెట్ ఆడేట‌ప్పుడు దెబ్బ‌లు త‌గ‌ల‌డం స‌హ‌జం అని రోహిత్ శ‌ర్మ గాయాన్ని అత‌డు ధ్రువీక‌రించాడు. అయితే.. అదేమీ పెద్ద గాయం కాద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. ప్ర‌స్తుతం రోహిత్ బాగానే ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు. ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని, అత‌డు మెల్‌బోర్న్ టెస్టులో బ‌రిలోకి దిగుతాడ‌ని అన్నాడు. ఇక తాజాగా రోహిత్ శ‌ర్మ కూడా స్పందించాడు. మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన మోకాలి గాయం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బాక్సింగ్ డే టెస్టులో ఆడుతున్నానని చెప్పాడు. గాయంతో ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టత ఇచ్చాడు. అయితే, తాను బ్యాటింగ్ చేయబోయే స్థానంపై రోహిత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

జట్టుకు ఏది మంచిదైతే అది చేస్తానని వ్యాఖ్యానించాడు. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనే దాని గురించి చింతించవద్దని ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఇక విరాట్ కోహ్లీ ఫామ్, బ్యాటింగ్‌లో ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న ‘ఆఫ్ స్టంప్’ లోపాలపై మీడియా ప్రశ్నించగా… విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడని, లోపాలను అధిగమించే మార్గాన్ని కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కోహ్లీకి ఆఫ్ స్టంప్ లోపమా… ఆధునిక దిగ్గజ క్రికెటర్ అని మీరే చెబుతుంటారు. ఆధునిక దిగ్గజాలు సొంతంగా గాడిలో పడతారు’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను స్వేచ్ఛగా ఆడనిస్తామని, ప్రోత్సాహం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘జైస్వాల్ మైండ్‌సెట్‌ను మార్చకూడదు. అతడు తన బ్యాటింగ్‌ను మా అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. స్వేచ్ఛగా ఆడమంటూ ప్రోత్సహిస్తాం’’ అని కెప్టెన్ చెప్పాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది