Nitish Kumar Reddy : పుష్ప స్టైల్‌లో నితీష్ రెడ్డి సెంచరీ సెలబ్రేషన్స్… వైరల్ అవుతున్న వీడియో
ప్రధానాంశాలు:
Nitish Kumar Reddy : పుష్ప స్టైల్‌లో నితీష్ రెడ్డి సెంచరీ సెలబ్రేషన్స్... వైరల్ అవుతున్న వీడియో
Nitish Kumar Reddy : ind vs aus 4th test 2024 ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. india vs australia బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తో ఎంతో కీలకమైన పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ టెస్టులో కూడా అలాంటిదే కనిపించింది. మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగే సమయానికి టీమిండియా 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టీ-బ్రేక్ వరకు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 326 పరుగులు చేసింది. భారత జట్టు 148 పరుగులు వెనుకంజలో నిలిచింది. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. నితీష్ కుమార్ రెడ్డి తన టెస్టు కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
Nitish Kumar Reddy నీ యవ్వ తగ్గేదే లే..
టీమిండియా ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడితే నితీష్ రెడ్డి మాత్రం ఇప్పటికే హాఫ్ సెంచరీతో అదరగొట్టి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు.దీంతో మరోసారి మన తెలుగోడి పేరు క్రీడా ప్రపంచంలో మారుమోగిపోతోంది. గత మూడు టెస్టుల్లో 41,38(నాటౌట్),42,42,16 స్కోరు సాధించాడు. ఇలా మూడునాలుగు సార్లు హాప్ సెంచరీ మిస్సయ్యాడు. దీంతో ఈసారి ఎలాగైనా మంచిస్కోరు సాధించాలని పట్టుదలతో ఆడుతున్న నితీష్ ఏకంగా సెంచరీ సాధించాడు. టీమిండియాకు ఫాలో ఆన్ తప్పదన్న సమయంలో బ్యాటింగ్ కు దిగిన నితీష్ ఆదుకున్నాడు. తన టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ సాధించిన నితీష్ రెడ్డి సరికొత్తగా సంబరాలు చేసుకున్నాడు.
పుష్ప2 సినిమాల్లో అల్లు అర్జున్ స్టైల్లో తగ్గేదేలే అనేలా బ్యాటుతో ఫోజిచ్చాడు. బ్యాటుతో గడ్డాన్ని నిమురుతున్నట్లు అతడు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టీమిండియా కష్టకాలంలో వుండగా అద్భుతంగా బ్యాటింగ్ తో మన తెలుగోడు ఆదుకోవడం చూసి మురిసిపోతున్నారు తెలుగు ప్రజలు. అలాంటిది నితీష్ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా గడ్డపై పుష్ఫ స్టైల్లో సంబరాలు చేసుకోవడం మనోళ్లను మరింతగా ఆకట్టుకుంది. దీంతో ‘నితీష్ అంటే ఫైర్ అనుకుంటివా… వైల్డ్ ఫైర్’ అంటూ అతడి సూపర్ ఇన్నింగ్స్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీమిండియా స్కోర్ 358/9 వద్ద వుండగా వర్షం స్టార్ట్ కావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ సమయంలో నితీష్ కుమార్ 105 పరుగులతో , సిరాజ్ 2 పరుగులతో ఉన్నారు