Nitish Kumar Reddy : లెజండరీ గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Nitish Kumar Reddy : లెజండరీ గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి.. వీడియో వైరల్
Nitish Kumar Reddy : బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా, ఈ రోజు ఉదయం 9 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఇన్నింగ్ ఎక్కువ సేపు కొనసాగలేదు. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత వికెట్ల పతనం ఆస్ట్రేలియా ఇన్నింగ్‌లోనూ కొనసాగింది. టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు.
Nitish Kumar Reddy అరుదైన క్షణం
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను బుమ్రా, ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.లబుషేన్ ఒక్కడే చాలా పోరాడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా తేలిపోయారు. ఇక చివరలో లియాన్, బోలండ్ భారత బౌలర్స్ ని చాలా పరీక్షించారు. అయితే మూడో రోజు హైలైట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి. టెస్టుల్లో సెంచరీ బాదాడు. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు. అర్ధసెంచరీ చేశాడు సుందర్. సరిగ్గా 50 పరుగులు చేసిన తరువాత సుందర్ అవుట్ అయ్యాడు.
99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి మరీ తొలి సెంచరీని అందుకున్నాడు నితీష్ కుమార్ తెగువకు అద్దం పట్టింది. బంతి బౌండరీ దాటిన వెంటనే అతన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తోన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఉదయం నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం.. టీమిండియా లెజెండర్ సునీల్ గవాస్కర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కాడు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆనంద భాష్పాలు రాల్చాడు. సునీల్ గవాస్కర్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు. ఓ తండ్రిగా గర్వించదగ్గ క్షణం అంటూ వ్యాఖ్యానించాడు. కొడుకు కోసం ముత్యాలరెడ్డి చేసిన ఎంతో త్యాగం చేశారని, ఉద్యోగాన్ని సైతం వదులుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నాడు.